జాతీయ వార్తలు

శాంతి, స్థిరత్వాలకు కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: భారత్ ఇరుగుపొరుగు దేశాలతో పాటు ఈ విస్తృతమయిన ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలకు కట్టుబడి ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. ముందుకొచ్చే ఎలాంటి ముప్పుతోనయినా పోరాడటానికి స్నేహితులతో భాగస్వామ్యాన్ని ఆర్మీ కొనసాగిస్తుందని ఆయన అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన రక్షణ సంస్థల నాలుగో సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ‘మనం ప్రపంచంలోనే ప్రధానమయిన సాయుధ బలగాలలో ఒకటిగా ఉన్నాం. కేవలం సాయుధ బలగాల పరిమాణంలోనే కాదు, విస్తృతమయిన యుద్ధ అనుభవం, వృత్తి నైపుణ్యం, ఇతర నైపుణ్యాలలోనూ మనం ప్రధాన సాయుధ బలగాలలో ఒకటిగా ఉన్నాం. వీటన్నింటి రీత్యా మనకు విశిష్టమయిన లక్షణాలు ఉన్నాయి. మనం ఇరుగుపొరుగు దేశాలతోనే కాకుండా విస్తృతమయిన రీజియన్‌లో శాంతి, స్థిరత్వాలకు కట్టుబడి ఉన్నాం. గతంలో వలెనే భవిష్యత్తులోనూ దీనిని కొనసాగిస్తాం. ముంచుకొచ్చే ఎలాంటి ముప్పుతోనయినా పోరాడటానికి మనం స్నేహితులతో కలిసి పనిచేస్తాం’ అని రావత్ అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మాట్లాడుతూ సముద్రపు దోపిడీ వంటి ముప్పులను ప్రస్తావించారు. ఇది వివిధ దేశాలకు విస్తరించి ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిని ఎదుర్కోవడానికి ప్రపంచంలో వివిధ దేశాల మధ్య సముద్ర సంబంధమయిన సహకారం, ఉమ్మడి సైనిక సమర్థతను పెంచుకోవడం వంటివి ఎంతయినా అవసరమని ఆయన అన్నారు. ‘హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒకే రకమయిన అభిప్రాయాలు కలిగిన సభ్య దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, కలిసి పనిచేయడానికి నేవీ కట్టుబడి ఉంది’ అని సింగ్ పేర్కొన్నారు.