జాతీయ వార్తలు

నమోదు కాని టీబీ కేసులు 5.4 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: దేశంలో గత సంవత్సరం సుమారు 5.4 లక్షల క్షయ వ్యాధి (టీబీ) కేసులు నమోదు కాలేదు. ఈ వ్యాధి ఎక్కువగా ఉన్న ప్రపంచంలోని ఎనిమిది దేశాలలో భారత్ కూడా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన ‘గ్లోబల్ టీబీ నివేదిక’ ఈ విషయం వెల్లడించింది. అయితే, భారత్‌లో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2018లో టీబీ (ట్యూబర్‌క్యూలోసిస్) వ్యాధిగ్రస్తుల సంఖ్య సుమారు 50వేలు తగ్గిందని ఆ నివేదిక పేర్కొంది. 2017లో భారత్‌లో 27.4 లక్షల క్షయ వ్యాధిగ్రస్తులు ఉండగా, 2018లో వారి సంఖ్య 26.9 లక్షలకు తగ్గింది. దేశంలో ప్రతి లక్ష మంది జనాభాలో 2017లో 204 మంది టీబీ రోగులు ఉండగా, 2018లో వారి సంఖ్య 199కి తగ్గింది. ‘ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ టీబీ కార్యక్రమాలలో ప్రపంచంలో 3మిలియన్ల టీబీ కేసులు నమోదు కాలేదు.
భారత్‌లో 2018లో 2.69 మిలియన్ల టీబీ కేసులు ఉండగా, వాటిలో భారత ప్రభుత్వం వద్ద 2.15 మిలియన్ల టీబీ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మిగతా 5,40,000 టీబీ కేసులు నమోదు కాలేదు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. యాంటీ- ట్యూబర్‌క్యూలోసిస్ డ్రగ్ రిఫామ్‌పిసిన్ రెసిస్టెన్స్ కోసం పరీక్షించిన వారి సంఖ్య 2017లో 32 శాతం ఉండగా, 2018లో 46 శాతానికి పెరిగింది. అయితే ఈ వ్యాధికి విజయవంతమయిన చికిత్స పొందిన వారి సంఖ్య కూడా పెరిగింది. 2016లో వీరి సంఖ్య 69 శాతం ఉండగా, 2017లో 81 శాతానికి పెరిగింది. అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 2018లో ఎక్కువ మంది టీబీ వ్యాధి నుంచి రక్షించుకోవడానికి చికిత్స తీసుకున్నారని ఆ నివేదిక వెల్లడించింది.