జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో మావోల ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 1: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేసి వారికి ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ముగ్గురు యువకులను కాంకేర్ జిల్లాలో దారుణంగా హతమార్చారు. కాంకేర్ జిల్లాలోని ఆమాబేడా పోలీస్‌స్టేషన్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న హుర్రా పింజోడి అనే గ్రామానికి మావోయిస్టు పశ్చిమ డివిజన్ కమిటీ కార్యదర్శి రమేశ్, కమాండర్ సోనూ ఆధ్వర్యంలో 7 నుంచి 8 మంది సాయుధ మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో చేరుకున్నారు. గ్రామంలోని జైన్‌కుమార్ (22), అంతూరామ్ హుర్రా(24), మాన్‌కరామ్ హుర్రా(32) అనే యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని గ్రామానికి అరకిలోమీటరు దూరంలో ఉన్న సాకినాన్ గ్రామ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. మావోయిస్టు దళాల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారంటూ వారిపై అభియోగం మోపారు. ప్రజాకోర్టు నిర్వహించి వారిని చితకబాదారు. అనంతరం పదునైన ఆయుధాలతో దారుణంగా నరికి చంపారు. ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. కాగా కాంకేర్ ఎస్పీ ఎంఎల్ కొట్వానీ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండించారు. చనిపోయిన ముగ్గురికి పోలీసులతో ఎటువంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు.