జాతీయ వార్తలు

తెలంగాణ భవన్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా శనివారం వామపక్ష పార్టీనేతలు, కార్యకర్తలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ను ముట్టడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని నిరసనకారులు ధ్వజమెత్తారు. సీపీఐ నాయకుడు నారాయణ నాయకత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం తెలంగాణ భవన్ గేట్ల వద్ద నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెంటనే ఆర్‌టీసీ ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించి సమ్మెను విరమింపజేయాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె కు దిగిన వేలాది మంది ఆర్‌టీసీ ఉద్యోగులను తొలగించే అధికారం సీఎం ఎవరు ఇచ్చారంటూ వారు నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించాలని వారు డిమాండ్ చేశా రు. నారాయణ నాయకత్వంలో కొంద రు నాయకులు తెలంగాణ భవన్ కమిషనర్‌ను కలిసి ఒక వినతిపత్రం అందజేశారు.