జాతీయ వార్తలు

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో రేపే పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/ చండీగఢ్ : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది. ఈ రెండు రాష్ట్రాలలో అక్టోబర్ 21న పోలింగ్ జరుగుతుంది. పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. హర్యానాలో ప్రచారం చివరి రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేవారి, ఎల్లెనాబాద్ సభల్లో ప్రసంగించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికరణం 370 రద్దు అంశంపై ఎక్కువగా కేంద్రీకరణ జరిగింది. రాహుల్ గాంధీ కొన్ని సభలలో మాత్రమే ప్రసంగించగా, బీజేపీ వైపు నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా బీజేపీ అగ్ర నాయకులు విస్తృతంగా పర్యటించి అధికరణం 370 రద్దు అంశాన్ని ప్రధానంగా చర్చకు తెచ్చారు. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వం వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు, ప్రధానంగా కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి అధికార పక్షంతో తలపడుతోంది. మహారాష్టల్రో 4,28,43,635 మంది మహిళలు, 4,68,75,750 మంది పురుషులు కలిసి మొత్తం 8,98,39,600 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో 3,237 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 235 మంది మహిళలు ఉన్నారు. బీజేపీ 164 స్థానాల్లో, శివసేన 124 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 147 స్థానాల్లో, ఎన్‌సీపీ 121 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. హర్యానాలో 1.83 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉండగా, వారిలో 83 లక్షలకు పైగా మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో 19,578 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో 13,837 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఈసారి 75 స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 90 నియోజకవర్గాల నుంచి మొత్తం 1,169 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. వీరిలో 105 మంది మహిళలు ఉన్నారు.