జాతీయ వార్తలు

భారత్-మయన్మార్ నౌకా విన్యాసాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 19: భారత్-మయన్మార్ నౌకాదళాల రెండో ద్వైపాక్షిక విన్యాసాలు శుక్రవారం విశాఖలో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే నౌకాశ్రయ దశ (హార్బర్ ఫేజ్) కార్యక్రమంలో భాగంగా ఇరు దేశాలకు చెందిన నౌకాదళ అధికారులు, యుద్ధ నౌకలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. మయన్మార్ నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు యూఎంఎస్ సిన్ ఫ్యూ షిన్ (ఎఫ్-14), యూఎంఎస్ తబిన్‌శే్వటి (773) విశాఖ తీరానికి చేరుకున్నాయి. నౌకాశ్రయ దశలో ఇరు దేశాలకు చెందిన నౌకా వాణిజ్యం, ఇతర సముద్ర అంశాలపై పరస్పరం చర్చించుకుంటారు. ఈ కార్యక్రమంలో తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్‌తో పాటు మయన్మార్ నౌకాదళానికి చెందిన ఫ్లీట్ కమాండర్ కెప్టెన్ టెట్ ఎల్విన్ తున్, కమాండర్ సై టెట్ నాయింగ్, కింగ్ తపిన్‌ష్వే హెచ్‌టీ, కమాండర్ కయావ్ థైన్‌ఖా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20 వరకూ జరిగే నౌకాశ్రయ దశ కార్యక్రమంలో మయన్మార్ నౌకాదళ ప్రతినిధులు ఈఎన్‌సీ యూనిట్ల సందర్శనలో పాల్గొంటారు. అలాగే శిక్షణ మరియు నిర్వహణ కార్యక్రమాలను పరిశీలిస్తారు. అనంతరం ఈనెల 22 వరకూ సముద్ర దశ విన్యాసాల్లో ఇరు దేశాల నౌకాదళ యుద్ధ నౌకలు పాల్గొంటాయి. భారత్ నౌకాదళం నుంచి ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్, ఐఎన్‌ఎస్ కతార్ నౌకలు, మయన్మార్ నేవీ నుంచి యూఎంఎస్ సిన్ ఫ్యూషిన్, తబిన్‌శే్వటి యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. బంగాళాఖాతంలో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల విన్యాసాలు నిర్వహిస్తాయి.
*చిత్రాలు.. భారత్-మయన్మార్ నౌకా విన్యాసాలు
*విశాఖలో సమావేశమైన భారత్, మయన్మార్ నౌకాదళాల ప్రతినిధులు (ఇన్‌సెట్‌లో )