జాతీయ వార్తలు

దేశాన్ని గాడిలో పెట్టడమే మీ బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే ప్రభుత్వ బాధ్యత అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు సంబంధించి వినూత్న ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చినందుకు ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన అభిజిత్ బెనర్జీపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన విమర్శలను తిప్పికొట్టిన ప్రియాంక గాంధీ ‘ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని రక్షించడానికే ప్రభుత్వం ప్రయత్నించాలి. అదే దాని ప్రాథమిక బాధ్యత. అంతేగానీ కామెడీ సర్కస్‌ను నిర్వహించడం కాదు’ అని అన్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ‘న్యాయ్’ పథకాన్ని అభిజిత్ బెనర్జీ బలపరచిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడిన పియూష్ గోయల్ ‘మొత్తం భారత ప్రజలే ఆ కనీస ఆదాయ పథకాన్ని తిరస్కరించారు’ అని అన్నారు. అలాంటపుడు అభిజిత్ బెనర్జీ ఆలోచనలను అంగీకరించాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు. దీనిపై విరుచుకుపడ్డ ప్రియాంక గాంధీ బీజేపీ నేతలు తమ కర్తవ్యాన్ని నిర్వహించడం మాని, ఇతరులు సాధించిన విజయాన్ని తప్పుపట్టడం మొదలుపెట్టారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికానికి దారితీస్తున్న ప్రధాన కారణాలపై అభిజిత్ బెనర్జీ చిత్తశుద్ధితో పరిశోధనలు చేసి నోబెల్ పురస్కారాలు పొందారని, అలాంటి ఆయనపైనే బీజేపీ నేత విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక పరిస్థితి మాంద్యం గుప్పిట చిక్కుకుందంటూ మీడియాల్లో వచ్చిన కథనాలను ప్రియాంక తన ట్వీట్‌లో ఉటంకించా రు. ముఖ్యంగా ఆటోరంగానికి ఆర్థిక మాం ద్యం కకావికలు చేస్తోందని, సెప్టెంబర్ నెలలో కూడా ఈ రంగం మాంద్యానికి లోనైందని తెలిపారు.

*చిత్రం... కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ