జాతీయ వార్తలు

‘అమరుల కుటుంబాల’కు రూ. కోటి సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహతక్, అక్టోబర్ 19: హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 21న పోలింగ్ జరుగనున్న తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే సాయుధ బలగాలలోని సిబ్బంది ఎవరయినా విధి నిర్వహణలో చనిపోతే వారి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఆప్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేస్తామని, హర్యానాను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కూడా ఆప్ హామీ ఇచ్చింది. ఆప్ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ జైహింద్ ఎన్నికల ప్రచార ఘట్టం ముగియడానికి కొన్ని గంటల ముందు తమ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.