జాతీయ వార్తలు

టెక్నాలజీకి భయపడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: సాంకేతిక పరిజ్ఞానాన్ని దోషిగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం అంటే భయపడే వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నాడిక్కడ తన అధికార నివాసంలో సాంకేతిక పరిజ్ఞానంపై రాసిన ఒక పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న దేశ ప్రజల ప్రయోజనాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక సవాలుగా చూడటం జరిగిందని ఆయన అన్నారు. కృత్రిమ మేధస్సుతో ప్రమాదాలు లేదా ఎప్పుడు రోబోలు మానవుల కన్నా తెలివిగలవి అవుతాయి? అనే అంశాలపై చర్చ జరగకూడదని ప్రధాన మంత్రి అన్నారు. ‘అయితే, కృత్రిమ మేధస్సుకు, మానవ సంకల్పాలకు మధ్య వారధిని నిర్మించడం ఎలా? అనే అంశంపై చర్చ జరగాలి’ అని ఆయన సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజి) ఒక వారధి అని, విభాగిని కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన నొక్కి చెప్పారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, టాటా సన్స్ ప్రధాన ఆర్థికవేత్త రూపా పురుషోత్తమన్ సంయుక్తంగా ‘బ్రిడ్‌జిటల్ ఇండియా’ అనే ఈ పుస్తకాన్ని రచించారు. టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కూడా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని ప్రధాన మంత్రి మోదీ ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

*చిత్రం... ప్రధాన మంత్రి మోదీ