జాతీయ వార్తలు

ఓటరు మొగ్గు ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/ఛండీగడ్, అక్టోబర్ 20: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 51 ఉప ఎన్నికలను సోమవారం నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారం తమదేనన్న ధీమాతో బీజేపీ దాని మిత్రపక్షాలు, కమలనాథులకు చెక్ పెట్టాలన్న భావనతో ప్రతిపక్షాలు తీవ్రంగా పని చేస్తున్నాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు ద్వారా తీర్పు ఇవ్వబోతున్నారు. అధికార బీజేపీ-శివసేన పార్టీలు ఒకవైపు, కాంగ్రెస్-ఎన్‌సీపీ మరోవైపు హోరాహోరీగా తలపడుతున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ సీట్టలో 3,237 మంది అభ్యర్థులు నువ్వా-నేనా అన్న ట్లు తలపడుతున్నారు. హర్యానాలో 90 స్థానాలకు 1369 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవా రం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వర కు పోలింగ్ జరగనున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సౌత్-వెస్ట్ నాగ్‌పూర్ స్థానం నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నాయకుడు అశోక్ చౌహ న్ నాందేడ్ జిల్లాలోని భోకార్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఇది పరీక్ష వంటిది. ఫడ్నవీస్ సారథ్యంలో అభ్యర్థులు ప్రజా తీర్పు కోసం రెండో దఫా నిలబడ్డారు. శివ సేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే ఎన్నికల బరిలో తొలి దఫా దిగారు. ఆదిత్య థాక్రే ముంబయిలోని వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తం 288 స్థానాల్లో బీజేపీ 164 స్థానా ల్లో పోటీ చేస్తున్నది. ఓట్లు చీలి పోకుండా ఉం డాలన్న భావనతో బీజేపీ చిన్న పార్టీలను కలుపుకుని పోతున్నది. 164లో కొన్ని సీట్లను ఆ పార్టీలకు ఇచ్చింది. కాగా మిత్రపక్షమైన శివసేనకు 124 సీట్లు విడిచి పెట్టింది. ఇక ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ 147 స్థానాల్లో అభ్యర్థులు దింపింది. అంతేకాకుండా మిత్రపక్షమైన ఎన్‌సీపీకి 121 సీట్లు కేటాయించింది. మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) 101 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇంకా 1,400 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రచారం శనివారం సాయంత్రం ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 8,98,39,600 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,06,76, 013 మం ది 18 నుంచి 25 ఏళ్ళలోపు ఓటర్లు ఉన్నారు. 96,661 పోలింగ్ కేంద్రాలకు 6.5 లక్షలమంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.
నాందేడ్ సౌత్ సీటులో 38 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.