జాతీయ వార్తలు

పేట్రేగుతున్న నేరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఉత్తరప్రదేశ్‌లో నేరాల తీవ్రత పెరిగిందని, వాటిని అదుపు చేయడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పినా అధికార బీజేపీ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయిందంటూ ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని ప్రధాన నేరాలను ఉటంకిస్తున్న కథనాలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. హిందూ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు కమలేష్ తివారి హత్య ఉదంతాన్ని ఆమె ఉటంకించారు.
ప్రియాంక మరో ఇందిర
లక్నో: మరో రెండేళ్లలో ఉత్తరప్రదేశ్‌కు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ కుమార్ అన్నారు. ప్రియాంక గాంధీని మరో ఇందిరాగాంధీగా అభివర్ణించిన ఆయన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆమె పెనుమార్పులు తీసుకువస్తారని స్పష్టం చేశారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలంటే రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భయపడే పరిస్థితి తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. ఈ అన్నాచెల్లెళ్లు యూపీలో ప్రచారం మొదలుపెడితే యోగి సర్కారుకు నూకలు చెల్లినట్టేనని పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ తెలిపారు. తాను కేవలం పార్టీ కార్యకర్తనని, ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశ్యం తనకు లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా అజయ్ కుమార్ వెల్లడించారు. ఎన్నో పోరాటాల్లో, సంఘర్షణల్లో కీలక భూమిక పోషించిన ఘనత కాంగ్రెస్‌కు ఉందని, ఈ పార్టీ కృషి వల్లే చరిత్ర మారిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు సమాజవాది పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను అందించినా ఆ బాధ్యతల నిర్వహణలో ఆ పార్టీ నాయకత్వం విఫలమైందని అన్నారు.
రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కల్పించేందుకు ప్రియాంక సారథ్యంలో కార్యకర్తలు అహరహం శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గ్రామ, జిల్లా స్థాయిలను ప్రాతిపదికగా తీసుకుని ప్రజలతో అనుసంధానం అవుతామని, ఇందుకోసం బలమైన ప్రణాళికను రూపొందిస్తామని ఆయన వెల్లడించారు.
*చిత్రం...కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ