జాతీయ వార్తలు

ఉగ్రవాదానికి కేంద్ర బిందువు పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా ఉందని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించారు. ‘పొరుగుదేశం పాకిస్తాన్ మాకు ఒక్కరికే సమస్య కాదని, యావత్ ప్రపంచానికే సవాల్‌గా మారింది’అని సోమవారం ఇక్కడ ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎలా పెంచి పోషిస్తోందీ ప్రపంచ మొత్తం చూస్తోందని ఆయన అన్నారు. భారత్-పాకిస్తాన్ సంబంధాలు, ఇరుదేశాల మధ్య చర్చలకు ఆస్కారం ఉందా?అన్న ప్రశ్నకు రామ్ మాధవ్ బదులిస్తూ ‘గత ఏడేళ్లుగా ఒడిదుడుకులు మధ్య సాగుతోంది’అని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో మంచి స్నేహ సంబంధాలు ఉండాలని భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని అయితే సీమాంతం ఉగ్రవాదం సహా పలు ప్రధాన అంశాలపై పొరుగుదేశం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని బీజేపీ నేత పేర్కొన్నారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దేశంతో సంబంధాలంటే కష్టమే. ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది. ఇది ఒక్క భారత్‌కు సంబంధించింది కాదు. ప్రపంచానికే పెను సవాల్‌గా మారింది’ అని ఆయన చెప్పారు. యూఎస్- ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రామ్‌మాధవ్ మాట్లాడుతూ పాకిస్తాన్‌లో సంబంధాల గురించి సూచనలు, సలహాలు ఇచ్చే సమయం కాదది, ఇప్పుడాదేశం ప్రపంచ ఉగ్రవాదానికే కేంద్ర బిందువుగా ఉంది అని వెల్లడించారు. ‘పాకిస్తాన్ మాకొక్కరికే సమస్యగా లేదు. యావత్ ప్రపంచానికే పెను సవాల్‌గా మారింది. ఉగ్రవాద మూలాలు బలంగా ఉన్నాయి. వారికి అన్ని విధాలా చేదోడువాదోడుగా పాక్ ఉంటోంది’అని రామ్ మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేసి పాకిస్తాన్ నాయకత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీజేపీ నేత చెప్పారు. జమ్మూకాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుపై నానాయాగీ చేసిన పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై ఏకాకిగా మిగిలిపోయిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. దేశ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టుకోవాలన్న శ్రద్ధ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని, ఎంతసేపూ పొరుగుదేశాన్ని అస్థిర పరచాలన్న దృష్టితోనే వ్యవహరిస్తోందని రామ్‌మాధవ్ విమర్శించారు.