జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని తుడిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గువహటీ, అక్టోబర్ 21: దేశం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచేవేయాలన్నదే విధానమని కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని సోమవారం ఇక్కడ ప్రకటించారు.
దేశ అంతర్గత భద్రత కోసం బలగాలు కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు. ఆక్రమిత కాశ్మీర్‌లోని నీలం వ్యాలీలోని నాలుగు ఉగ్ర స్థావరాలను భారత్ దళాలు ఆదివారం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. భారత్ దాడుల్లో పది మంది పాక్ సైనికులు, అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. జమ్మూకాశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వద్ద పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు, ఒక పౌరుడు చనిపోయారు. తంగధార్ సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి ప్రతికారంగా పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు జరిపారు. ‘మన దళాలకు యావత్ జాతి సలామ్ చేస్తోంది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర జవాన్లను దేశం ఎప్పటికీ మరచిపోదు’అని పోలీసు అమరవీరుల సస్మరణ దినోత్సవంలో కిషన్‌రెడ్డి అన్నారు. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్మృతి పరేడ్’కు హోమ్‌శాఖ సహాయ మంత్రి హాజరయ్యారు. అమర జవాన్లకు ఆయన నివాళి అర్పించారు. శాంతి భద్రతల కోసం 1964 నుంచి ఇప్పటి వరకూ 879 మంది అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు.
*చిత్రం...పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం గౌహతిలో నివాళులు అర్పిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి