జాతీయ వార్తలు

1971 నాటి బంగ్లా యుద్ధమే పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: భారత్-అమెరికాల మధ్య బలమైన మైత్రీ బంధానికి 1971లో జరిగిన బంగ్లా సంక్షోభ సమయంలోనే పునాదులు పడ్డాయని అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం సమావేశంలో మాట్లాడిన 96 ఏళ్ళ కిసింజర్ ‘1971లో తలెత్తిన బంగ్లా సంక్షోభ సమయంలో భారత్-అమెరికాలు భిన్న మార్గాలే అనుసరించాయి. అయితే భద్రత, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి తమదైన రీతిలోనే ముందుకు సాగాయి’ అని అన్నారు. బంగ్లా అంశంపై భారత్-పాకిస్తాన్‌లు యుద్ధానికి దిగాయని, ఆ సమయంలోనే భారత్-అమెరికాలు కూడా సంఘర్షణ పరిస్థితి తలెత్తిందని కిసింజర్ తెలిపారు. ఆ సమయంలోనే అమెరికా-యుఎస్‌ఎస్‌ఆర్‌ల మధ్య ప్రచ్చన్న యుద్ధం సాగిందని అన్నారు. 1961 నాటి బెర్లిన్ సంక్షోభాన్ని ప్రస్తావించిన ఆయన ‘బెర్లిన్ నుంచి వైదొలగాలని అప్పటి సోవియట్ యూనియన్ నాయకత్వం అమెరికా మిత్రపక్షాలకు అల్టిమేటం ఇచ్చింది. ఆ సమయంలో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అమెరికాను సమర్థించకపోవడం పట్ల మా దేశంలో అసంతృప్తి తలెత్తింది’ అని గుర్తు చేశారు. అయితే భారత దేశం అప్పట్లో తటస్థ విధానానే్న అనుసరిస్తూ వచ్చిందని తెలిపారు. బంగ్లా యుద్ధ సమయంలోనే చైనాకు దగ్గర కావడానికి అమెరికా ప్రయత్నించిందన్నారు. అనంతర పరిస్థితులను ఒక్కటొక్కటిగా అధిగమించుకుంటూ విభేదాలను సామరస్యక పూర్వక రీతిలో పరిష్కరించుకుంటూ భారత్-అమెరికాలు బలమైన స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నాయన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో భద్రత విషయంలో ఇరు దేశాలు ఏకాభిప్రాయంతోనే ముందుకు సాగుతున్నాయన్నారు. అయితే ఇతరత్రా ఎలాంటి అంశాల ప్రభావం లేకుండానే ఈ రెండు దేశాలు తమ తమ అభిప్రాయాల బలంతోనే సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాయని కిసింజర్ స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రపంచంలోని ప్రతి భాగంలోనూ ఏదో రకమైన అలజడి తలెత్తుతోందని పేర్కొన్న ఆయన ‘వీటన్నింటిపైనా ఒకే రకమైన ఉమ్మడి అభిప్రాయాన్ని కలిగి ఉండలేం, అయితే శాంతి-అభివృద్ధికి సంబంధించి కలిసి కట్టుగా పని చేసే అవకాశం ఉంటుంది’ అని అన్నారు.
*చిత్రం... న్యూఢిల్లీలో సోమవారం జరిగిన వార్షిక ఇండియా లీడర్‌షిప్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్‌తో వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ కరచాలనం