జాతీయ వార్తలు

18 నుంచి పార్లమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 18 తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు జరుగుతాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఈ మేరకు పార్లమెంటుకు సందేశం పంపించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి, కేంద్ర మంత్రివర్గం పార్లమెంటరీ వ్యవహారాల ఉపసంఘం అధ్యక్షుతు రాజ్‌నాథ్ సింగ్ గత వారం తమ నివాసంలో జరిపిన సీసీపీఏ సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేసినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులను పెంచేందుకు సంబంధించిన బిల్లును ప్రతిపాదించే అవకాశాలున్నాయి. జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ క్యాపిటల్ రీజియన్) పరిధిలో ఉన్న నోయి డా, ఘజియాబాద్, గుర్‌గామ్, భాగపత్, సోనీపత్, బహదూర్‌గఢ్, జజ్జర్ తదితర ఉపగ్రహ నగరాలను ఢిల్లీలో విలీనం చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన. కార్మిక, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కొన్ని బిల్లులను ప్రతిపాదించవచ్చునని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కామన్ సివిల్ కోడ్‌ను అమలు చేసేందుకు సం బంధించిన బిల్లు శీతాకాల సమావేశంలో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆధార్ స్థానంలో కొత్త రకం గుర్తింపు కార్డును అమలులోకి తీసుకురావాలని అనుకుంటోంది. ఆధార్, పాన్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నింటికీ కలిపి ఒకే కార్డును ప్రజలకు ఇవ్వాలనుకుంటోంది. దీనికి సంబంధించిన బిల్లు తయారవుతోందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.