జాతీయ వార్తలు

తీరు మారకుంటే ఇంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 21: కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి, కాశ్మీర్‌లోకి చొరబాట్లను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు భారత సైన్యం చాలా గట్టిగానే బుద్ధి చెప్పిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇప్పటికైనా పాక్ తన తీరును మార్చుకోకపోతే మరింత తీవ్రస్థాయిలోనే ఈ ప్రతీకార చర్యలు ఉంటాయని సోమవారం లే ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. తూర్పు లడఖ్ ప్రాంతంలోని షియోఖ్ నదిపై నిర్మించిన 1400 అడుగుల రిన్‌చన్ వంతెన ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. దేశంలోనే అత్యంత ఎతె్తైన శాశ్వత వంతెనగా ఇది ఘనతను సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన రక్షణ మంత్రి 370, 35ఏ రాజ్యాంగ అధికరణల రద్దుతో లడఖ్ ప్రాంతంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయని, అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితులను సహించేది లేదని స్పష్టం చేశారు. భారత సైన్యం ఎప్పుడు కూడా పాక్‌పై తనంతట తానుగా దాడికి ఒడిగట్టలేదని పేర్కొన్న ఆయన పాకిస్తాన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వస్తోందని, భారత సమైక్యతకు, సమగ్రతకు ముప్పు కలిగించే రీతిలో ఉగ్ర చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. అయితే, మరోసారి భారత సైనికులు పాక్‌కు బుద్ధి చెప్పారని, భవిష్యత్తులో ఇదే రకమైన ప్రతిస్పందన ఉంటుందని ఆయన అన్నారు. ఈ వంతెన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, నార్తర్న్ కమాండ్ చీఫ్ రణ్‌బీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. లడఖ్ ప్రాంతానికి చెందిన దివంగత కల్నల్ రిన్‌చన్ పేరునే ఈ వంతెనకు పెట్టారు. కేవలం 15 నెలల కాలంలో ఈ వ్యూహాత్మక వంతెనను నిర్మించినందుకు బీఆర్‌ఓ సంస్థను రాజ్‌నాథ్ అభినందించారు. ఈ వంతెన వల్ల తూర్పు లడఖ్‌లోని దౌలత్‌బేగ్‌కు సైనిక దళాలను సునాయాసంగా తరలించడం సాధ్యమవుతుంది.
చైనాతో సుహృద్భావ సంబంధాలు
భారత్-చైనా మధ్య సుహృద్భావ సంబంధాలే కొనసాగుతున్నాయని, సరిహద్దు వివాదానికి సంబంధించి అవగాహనా పరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే, ఈ సమస్యను ఇరు దేశాలు ఎంతో పరిణితితో పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. తాజాగా నిర్మించిన వంతెన వల్ల భారత్-చైనా సరిహద్దుల మధ్య దూరం తగ్గుతుందని, ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇటీవల భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో తమిళనాడులోని మామల్లాపూర్‌లో శిఖరాగ్ర భేటీ జరిపిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కాశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించక పోవడాన్ని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే, ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలంటూ ప్రపంచ దేశాలన్నింటికీ చైనా పిలుపునివ్వడం కూడా సుహృద్భావ పరిణామమని ఆయన పేర్కొన్నారు.
*చిత్రం... లడఖ్‌లో నిర్మించిన ఈ వంతెనను సోమవారం ప్రారంభిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పక్కన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్