జాతీయ వార్తలు

మన లక్ష్యం.. విద్య, ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్వాలియర్, అక్టోబర్ 3: పట్టణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యానికి సంబంధించిన వౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. పట్టణీకరణ ప్రక్రియ నిరంతరమైనదని ఇందులో భాగంగానే విద్య, వైద్య రంగాలకు తగిన ప్రాధాన్యతను కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2020-22 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు అన్న హామీని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ నిలబెట్టుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ జివాజీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో 1088 మందికి ఇవిఎస్ ఇళ్లకు సంబంధించిన యాజమాన్య పత్రాలను, తాళాలను అందించారు. సమీకృత గృహ, మురికివాడల అభివృద్ధి పథకం కింద ఈ ఇళ్లను నిర్మించారు. ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తున్న కొద్దీ పట్టణీకరణ అన్నది అనివార్యంగా మారుతోంది, దాన్ని ఎవరూ ఆపలేరని ఈ సందర్భంగా ప్రణబ్ ఉద్ఘాటించారు. రానున్న ఐదు నుంచి పదేళ్ల కాలంలో ప్రతి ఒక్కరికీ సొంత గూడు ఉండేలా కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకప్పుడు ‘రోటి కపడా ఔర్ మకాన్’ అన్న నినాదం ఉందని, ఇప్పుడా నినాదానికి తాను ‘విద్య, ఆరోగ్యం’ అన్నదాన్ని చేరుస్తున్నానని రాష్టప్రతి తెలిపారు. ఇవన్నీ సమకూరినప్పుడే దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ కీలక భాగస్వామి కాగలుగుతారని చెప్పారు.