జాతీయ వార్తలు

ఢిల్లీ ఆరోగ్య మంత్రి జైన్‌కు సుప్రీం 25వేల జరిమానా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: రాజధాని ఢిల్లీలో విజృంభిస్తున్న డెంగ్యూ, చికున్ గునియాలపై అఫిడవిట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు సుప్రీంకోర్టు 25వేల రూపాయల జరిమానా విధించింది. వ్యాధుల నిర్మూలనలో నిర్లక్ష్యం చూపుతున్న అధికారుల పేర్లను ఇవ్వాల్సిందింగా సుప్రీం కోర్టు ఇంతకుముందు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలన్న కోర్టు ఆదేశాలను మంత్రి పట్టించుకోకపోవడంతో న్యాయమూర్తులు ఎంపి లోకూర్, వైవి చంద్రఛుడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంత్రికి పాతికవేలు జరిమానా విధించి ధర్మాసనం బుధవారం నాటికి అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. జైన్ తీరును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. అఫిడవిట్ దాఖలకు 24 గంటల గడువుకావాలని బెంచ్‌ను అభ్యర్థించినట్టు జైన్ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ ఉదయ్ సింగ్ తెలిపారు. ‘రోగాల బారిన పడి జనం మరణిస్తుంటే మీకు పట్టదు. పైగా 24 గంటల గడువు అడుగుతున్నారు’ అని కోర్టు మండిపడింది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తరఫున అఫిడవిట్ దాఖలు చేయడానికి ఆ శాఖ కార్యదర్శికి అనుమతి మంజూరు చేయాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ అన్నారు. కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. డెంగ్యూ, చికున్ గునియాల నివారణ, పరీక్షలకు సంబంధించి అధికారులు సహకరించడంలేదని మంత్రి జైన్ ఆరోపించారు. గత నెల 30 కేసును విచారించిన సుప్రీం కోర్టు మంత్రి ఆరోపణలను తీవ్రంగా పరిగణించి ఆ అధికారులు జాబితా ఇవ్వాలని ఆదేశించింది. అలాగే సోమవారం అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.