జాతీయ వార్తలు

ప్రధాని మోదీతో అభిజిత్ బెనర్జీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: నోబెల్ బహుమతి విజేత అభిజిత్ బెనర్జీ మంగళవారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య అనేక అంశాలపై ఆరోగ్యకరమయిన, విస్తృతమయిన చర్చ జరిగింది. భారత్‌లో జన్మించి, అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బెనర్జీని ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. భార్య ఎస్తెర్ డుఫ్లో, మిఖాయెల్ క్రెమెర్‌తో కలిసి ఆయన నోబెల్ బహుమతిని పంచుకున్నారు. ‘నోబెల్ బహుమతి విజేత అభిజిత్ బెనర్జీతో సమావేశం చాలా బాగా జరిగింది. మానవ సాధికారత దిశగా ఆయన తపన స్పష్టంగా కనిపించింది.
మా ఇద్దరి మధ్య అనేక అంశాలపై ఆరోగ్యకరమైన, విస్తృతమైన చర్చ జరిగింది. బెనర్జీ సాధించిన సాఫల్యతకు భారత్ గర్విస్తోంది. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నాను’ అని సమావేశానంతరం ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. మోదీ తన అధికార నివాసంలో బెనర్జీతో జరిగిన భేటీకి సంబంధించిన ఒక చిత్రాన్ని కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఈ సమావేశానంతరం ప్రధాని మోదీ అధికార నివాసం వద్ద అభిజిత్ బెనర్జీ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. అయితే దేశ ఆర్థిక పరిస్థితిపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ప్రభుత్వ విధానాలపై వ్యాఖ్యలు చేసే విషయంలో సంయమనం పాటించారు. ‘మా సమావేశం సహృద్భావపూరిత వాతావరణంలో మంచిగా జరిగింది. నాతో మోదీ వ్యతిరేక విషయాలు చెప్పించడానికి మీడియా ఎలా ప్రయత్నించిందో అనే అంశంపై ఒక జోక్‌ను పేలుస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడటం ప్రారంభించారు. ఆయన టీవీ చూస్తున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు దేనికోసం ప్రయత్నిస్తున్నారో ఆయనకు తెలుసు’ అని బెనర్జీ విలేఖరులతో అన్నారు. ఆర్థిక మాంద్యంపై మీరు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీ సమావేశం ఎలా జరిగింది? అని ఒక విలేఖరి వేసిన ప్రశ్నకు స్పందిస్తూ బెనర్జీ పై విధంగా సమాధానమిచ్చారు.

*చిత్రం... ప్రధాని మోదీతో అభిజిత్ బెనర్జీ భేటీ