జాతీయ వార్తలు

‘గిఫ్ట్ పాలసీ’ నిబంధనల సడలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులు కానుకలు స్వీకరించడానికి సంబంధించి ద్రవ్య పరిమితులను మూడింతలకుపైగా పెంచింది. అధికారులు మంగళవారం ఈ విషయం చెప్పారు. ప్రభుత్వం ఇటీవల సవరించిన నియమాలను ప్రస్తావిస్తూ, గ్రూప్ ఏ, బీ కేటగిరీల ఉద్యోగులు ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా రూ. అయిదు వేలకు మించిన విలువ గల గిఫ్ట్‌లను స్వీకరించరాదు. గతంలో ఈ పరిమితి రూ. 1,500గా ఉండింది. అదేవిధంగా గ్రూప్ సీ ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వ అనుమతి లేకుండా రూ. రెండు వేల వరకు విలువ కలిగిన కానుకలను స్వీకరించవచ్చు. గతంలో వీరికి రూ. 500 పరిమితిగా ఉండింది. గ్రూప్ ఏ లోని ప్రభుత్వ ఉద్యోగులు సీనియర్ అధికారులు. గ్రూప్ బీ లోని ప్రభుత్వ ఉద్యోగులు గెజిటెడ్ అధికారులు లేదా నాన్-గెజిటెడ్ అధికారులు. చాలా క్లరికల్ పోస్టులు, బహుళ బాధ్యతలు నిర్వహించే సిబ్బంది సీ కేటగిరీలో ఉన్నారు.