జాతీయ వార్తలు

భారత్‌కు రష్యా బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన భారత్‌కు రష్యా బాసటగా నిలిచింది. జమ్మూకాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో భారత సైనిక స్థావరంపై దాడి చేసి, 19మంది సైనికులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినవారే అని తొలిసారి బహిరంగంగా చెప్పిన దేశం రష్యా అని భారత్‌లోని రష్యా రాయబారి అలెగ్జాండర్ ఎం కాడాకిన్ సోమవారం ఇక్కడ పేర్కొన్నారు. ‘్భరత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద దాడులను మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాం’ అని ఆయన అన్నారు. ఏ దేశమైనా ఇలాంటి ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆయన పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాకిస్తాన్ పదే పదే అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడాన్ని ప్రస్తావించగా, ‘్భరత్‌లోని సైనిక స్థావరాలపై, శాంతియుతంగా జీవిస్తున్న సాధారణ ప్రజలపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడే పెద్దఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఇది అతి హీనమైన మానవ హక్కుల ఉల్లంఘన’ అని ఆయన బదులిచ్చారు.
రష్యా, పాకిస్తాన్‌ల మధ్య ఇటీవల జరిగిన సైనిక విన్యాసాల గురించి అడగ్గా, ‘అది ఇరు దేశాల సైన్యాల మధ్య సాధారణంగా జరిగేవే. వాటి గురించి భారత్ ఆందోళన చెందకూడదు’ అని ఆయన బదులిచ్చారు. ఆ సైనిక విన్యాసాల సారాంశం ఉగ్రవాద వ్యతిరేక పోరాటమని, అందువల్ల ఆర్మీని ఉగ్రవాద దాడులకు ఉపయోగించుకోవద్దని రష్యా పాకిస్తాన్‌కు బోధిస్తుందని ఆయన వివరించారు.