జాతీయ వార్తలు

ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: భారతీయులు చట్ట వ్యతిరేకంగా విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు, తెరిచిన బ్యాంకు ఖాతాలపై చర్యలు తప్పవని కేంద్రం సోమవారం ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం పర్యవేక్షణకు బహుళ సంస్థలతో ఒక బృందం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. సినీనటులు, వాణిజ్య, వ్యాపారవేత్తలు సహా భారత్‌కు చెందిన సుమారు 500మంది ప్రముఖులు పన్నులకు స్వర్గ్ధామమైన పనామాలోని సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్లు ‘పనామా పేపర్స్’ బయటపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం ఈ అంశంపై తనతో చర్చించారని, ఆయన సలహా మేరకు సిబిడిటి, ఆర్‌బిఐ, ఎఫ్‌ఐయు అధికారులతో కూడిన గ్రూప్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇక్కడ విలేఖరులకు చెప్పారు. ‘వివిధ ప్రభుత్వ సంస్థలైన సిబిడిటి, ఎఫ్‌ఐయు, ఎఫ్‌టిఅండ్‌టిఆర్ (్ఫరిన్ టాక్స్ అండ్ టాక్స్ రీసెర్చ్), ఆర్‌బిఐలు ఈ బహుళ సంస్థల గ్రూప్‌లో ఉంటాయి. ఈ గ్రూప్ నిరంతరం ఈ ఖాతాలను పర్యవేక్షిస్తుంది. ఏవైనా ఖాతాలు చట్టవ్యతిరేకంగా ఉన్నట్లు బయటపడితే వెంటనే కఠిన చర్య తీసుకుంటుంది’ అని జైట్లీ వివరించారు. పనామాలోని న్యాయ సంస్థ మోస్సాక్ ఫోనె్సకాకు చెందిన లీకయిన పత్రాల ఆధారంగా ఆ దేశంలో వివిధ సంస్థల్లో భారత్‌కు చెందిన 500 మంది ప్రముఖులు పెట్టుబడులు పెట్టినట్లు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో జైట్లీ ఈ విషయం ప్రకటించారు. రానున్న రోజుల్లో మరికొన్ని పేర్లు బయటకొస్తాయని పేర్కొన్నారు. భారతీయుల పేర్లను వెలుగులోకి తెచ్చిన పరిశోధనను తాను ఆహ్వానిస్తున్నానని, ఇలాంటి అక్రమాలను బయటపెట్టడం ఆరోగ్యకరమైన చర్య అని అన్నారు. ప్రపంచం మరింత పారదర్శకంగా మారుతోందని తాను ఎప్పుడూ చెబుతుంటానని, దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన చర్యల వల్ల ఇలాంటి సమాచారం అంతా మెల్లగా వెలుగులోకి వస్తోందని జైట్లీ అన్నారు.