జాతీయ వార్తలు

నీళ్లు వదులుతారా, లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: తమిళనాడుకు కావేరి జలాలను సెప్టెంబర్ 30న తామిచ్చిన ఆదేశాలను అమలు చేస్తారా, లేదా? అన్నది మంగళవారం మధ్యాహ్నం కల్లా నివేదిక ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. మరోవైపు కావేరి జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలన్న ఉత్తర్వులను సవరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మరో పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానంలో వేసింది. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. కావేరి జలాలకు సంబంధించి ప్రధానమైన వివాదం ఇంకా కోర్టులోనే పెండింగ్‌లో ఉన్నదని, పైగా సిడబ్ల్యుఎంబి కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి వస్తుందని కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 30న సుప్రీం కోర్టు రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున అక్టోబర్ 1 నుంచి 6 వరకు తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఈ తీర్పు అమలుపై మంగళవారం మధ్యాహ్నం 2గంటల కల్లా నివేదిక సమర్పించాలని కర్ణాటకకు పేర్కొంది. ‘‘చట్టం ఆగ్రహం’’ ఎప్పుడు తీవ్రంగా ఉంటుందో ఎవరూ చెప్పలేరని కర్ణాటకను హెచ్చరించింది. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలంటూ సెప్టెంబర్ 20, 27, 30లలో సుప్రీం కోర్టు ఇచ్చిన మూడు తీర్పులను కర్ణాటక గౌరవించలేదు. ఈ తీర్పులు న్యాయానికి తీవ్ర విఘాతం అని పేర్కొంటూ కర్ణాటక సుప్రీంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేసింది.