జాతీయ వార్తలు

మళ్లీ పేట్రేగిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, అక్టోబర్ 3: ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ దళాలు తమ దాడుల్ని మరింత ముమ్మరం చేశాయి. సోమవారం ఏకంగా నాలుగు సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనటు పాల్పడ్డాయి. పూంచ్ జిల్లాను ఆనుకుని ఉన్న సరిహద్దు పొడవునా ఉన్న సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఫిరంగి గుళ్లతో దాడులకు ఒడిగట్టాయి. అంతే తీవ్రతతో కాల్పులకూ పాల్పడ్డాయి. ఈ ఫిరంగి గళ్లు, తూటాల దాడిలో ఐదుగురు పౌరులు గాయపడ్డారు. ఆ ప్రాంతంలో ఉన్న అనేక దుకాణాలు దగ్ధమయ్యాయి. భారత దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ పాకిస్తాన్ సైనిక శిబిరం ధ్వంసమైంది. అధీన రేఖ పొడవునా అనేక చోట్ల ఇరు దేశాల దళాల మధ్య తీవ్రస్థాయిలోనే కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. షాపూర్, క్రిష్ణాగాటి,మండి,సబ్జియాన్ సెక్టార్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయన్నారు. 120ఎమ్‌ఎమ్,80ఎమ్‌ఎమ్ పరిమాణంలోని మోర్టారు బాంబులు, చిన్నచిన్న ఆయుధాలతో పాకిస్తాన్ సైనికులు దాడులు జరిపారని రక్షణ విభాగం ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. పాకిస్తాన్ దళాలు కాల్పులకు ఒడిగట్టిన ప్రతిసారీ భారత దళాలు అంతే తీవ్రతతో ఎదురుకాల్పులు జరిపాయన్నారు. పాక్ కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్చామని, ఓ ఫిరంగి గుండు భద్రతా దళ శిబిరంలో పడిందని ఫలితంగా ఆయిల్ డబ్బాలు అంటుకోవడంతో మంటలు వ్యాపించి సమీపంలోని అనేక దుకాణాలు దగ్ధమయ్యాయని చెప్పారు.

చిత్రం.. సరిహద్దులో ఉద్రిక్తతలు తలెత్తడంతో జమ్ము శివారులోని ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో సేదదీరుతున్న ఓ వృద్ధురాలు