జాతీయ వార్తలు

బారాముల్లాలో తప్పించుకున్న ముష్కరులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 3: జమ్మూ-కాశ్మీరులోని బారాముల్లాలో సైనిక శిబిరంపై ఆదివారం రాత్రి ఉగ్రవాదులు జరిపినట్లుగా భావిస్తున్న దాడిపై గందగోళం నెలకొంది. ఈ దాడిలో బిఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)కు చెందిన ఒక జవాను మృతిచెందిన విషయం విదితమే. అయితే ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్రవాదులు వెంటనే అక్కడినుంచి పారిపోయి ఉంటారని పారా మిలటరీ అధికారులు చెబుతున్నారు. జాన్‌బాజ్‌పురాలోని బిఎస్‌ఎఫ్ 40వ బెటాలియన్‌కు చెందిన ఒక సెంట్రీ అక్కడి ఓపెన్ కిచెన్ వద్ద అనుమానాస్పద కదలికలను గమనించడంతో ఉగ్రవాదులు శిబిరంలోకి ప్రవేశించి ఉండవచ్చని భావించి కాల్పులు జరిపాడని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కాల్పులతో అక్కడికి సమీపంలోని సైనిక శిబిరం ఉలిక్కిపడటంతో అందులోని రాష్ట్రీయ రైఫిల్స్ జవాన్లు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు భావించిన దిశవైపు కాల్పులు జరపడంతో అన్ని వైపుల నుంచి కాల్పులు కొనసాగాయి. అయితే ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించారా లేక బయటి వైపు నుంచి ఎవరైనా కాల్పులు జరిపారా? అన్నది స్పష్టం కాలేదు. దాదాపు గంటన్నరపాటు కాల్పులతో ఆ ప్రాంతం హోరెత్తిన తర్వాత ఇల్యుమినేటర్లు ఆకాశాన్ని కాంతివంతం చేసి చూడగా, ఉగ్రవాదులెవరూ కనిపించలేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే బిఎస్‌ఎఫ్ శిబిరంపై దాడికి పాల్పడిన వెంటనే ఉగ్రవాదులు చీకటి మాటున అక్కడినుంచి పారిపోయి ఉంటారని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో బిఎస్‌ఎఫ్‌కు చెందిన నితిన్, పల్వీందర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడటంతో వారిని హుటాహుటిన శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నితిన్ ప్రాణాలు విడిచాడు. అయితే నితిన్ మరణానికి ఉగ్రవాదుల కాల్పులు కారణమా లేక ఉగ్రవాదులు ప్రవేశించినట్టు భావించి భారత బలగాలు జరిపిన కాల్పుల్లోనే నితిన్ గాయపడ్డాడా అనే విషయం తేలలేదు. ఏది ఏమైనప్పటికీ గత నెల 28వ తేదీ అర్ధరాత్రి భారత బలగాలు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై మెరపు దాడులు నిర్వహించినప్పటి నుంచి భద్రతా సంస్థలన్నీ పూర్తి అమ్రత్తతో ఉండాలని అధికారులు ఆదేశించారు.

చిత్రం.. బారాముల్లాలో మరణించిన నితిన్ భౌతిక కాయానికి వందన సమర్పణ చేస్తున్న బిఎస్‌ఎఫ్ జవాన్లు