క్రైమ్/లీగల్

బాలిక రేప్-మర్డర్ కేసులో రివ్యూ పిటిషన్ తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: కోయంబత్తూర్‌లో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య కేసులో నిందితుడి రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. నిందితుడి మరణశిక్ష తీర్పు అంశంలో ఎలాంటి పిటిషన్‌లను స్వీకరించేది లేదని కోర్టు పునరుద్ఘాటించింది. మెజారిటీ నిర్ణయం మేరకు రివ్యూ పిటిషన్‌ను స్వీకరించలేమని స్పష్టం చేసింది. 2010లో మనోహరన్ అనే వ్యక్తి తన సహచరుడితో కలిసి స్కూలుకు వెళ్తున్న పదేళ్ల చిన్నారితో పాటు ఏడేళ్ల బాలిక సోదరుడి చేతులను తాళ్లతో కట్టి అపహరించుకు వెళ్లి అత్యంత కిరాతకంగా రేప్ చేయడమే కాకుండా కాలువలోకి తోసి హతమార్చిన సంగతి పాఠకులకు విదితమే. ఈ కేసులో మరో నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మనోహర్ మరణశిక్ష అంశంపై గత నెలలో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై కోర్టు స్టే మంజూరు చేసింది. తాజాగా గురువారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఘటనను ‘అరుదైన వాటిలోనే అరుదైనది’ అభివర్ణిస్తూ 2:1 మెజారిటీ నిర్ణయం మేరకు శిక్షపై ఎలాంటి పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది.