జాతీయ వార్తలు

సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 8: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కారణంగా, శనివారంతో పాత సర్కారు గడువు ముగుస్తుంది. అయితే, ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో, సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. కానీ, ఎన్నికల్లో పోటీచేసిన శివసేనతో సీఎం పదవిపై బీజేపీకి వివాదం ఏర్పడింది. అధికారం, పదవులను చెరిసగం పంచుకోవాలని ఎన్నికలకు ముందు చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని, దాని ప్రకారం సీఎం పదవిని రెండున్నర సంవత్సరాలు బీజేపీ తీసుకుంటే, మరో రెండున్నర సంవత్సరాలు తమకు అవకాశం ఇవ్వాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే వాదిస్తున్నారు. సుఎం పదవి పంచుకోవడాన్ని మినహాయిస్తే, మిగతా ఎలాంటి అంశాలనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ పలుమార్లు స్పష్టం చేయగా, ‘చెరి సగం’ అనే ఒప్పందం సీఎం పదవికి కూడా వరిస్తుందని శివసేన పట్టుబడుతున్నది. ఈ నేపధ్యంలో మహారాష్టల్రో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతున్నది. కాంగ్రెస్, ఎన్‌సీపీ కూటమికి 98 సీట్లు మాత్రమే దక్కడంతో, ఆ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేవు. బీజేపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడి తీరాలి. కానీ, రెండు పార్టీలు మొండి వైఖరిని వీడకపోవడంతో, రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదం పొంచివుంది. ఆదివారంలోగా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేకపోతే, నిర్ణయం కేంద్రం చేతికి వెళుతుంది. రాష్టప్రతి పాలనకు అవకాశం లేకపోలేదు. మొత్తం మీద పరిస్థితి అత్యంత ఉత్కంఠగా మారగా, సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేయడం సరికొత్త పరిణామం. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన కలిసిరావడం లేదని ఫడ్నవీస్ ఆరోపించారు. పార్టీకి చెందిన కొంత మంది ముఖ్య నేతలతో కలిసి శుక్రవారం రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారీని రాజ్ భవన్‌లో కలిసిన ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సహకరించడం లేదని, ఈ కారణంగానే రాజీనామా చేస్తున్నానని వ్యాఖ్యానించారు. తాను ఎన్ని పర్యాయాలు ఫోన్ చేసినప్పటికీ, ఉద్ధవ్ స్పందించలేదని ఆరోపించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని, కానీ, అందుకు ఉద్ధవ్ సరైన రీతిలో ముందుకు రావడం లేదని ఫడ్నవీస్ విమర్శించారు.
ముఖ్యనేతలతో ఉద్ధవ్ చర్చలు
మహారాష్టల్రో ప్రభుత్వ ఏర్పాటు, బీజేపీతో చర్చలు, ‘చెరి సగం’ ఒప్పందానికి కట్టుబడి ఉండడం, రెండున్నర సంవత్సరాలు సీఎం పదవిని దక్కించుకోవడం వంటి పలు అంశాలపై ముఖ్య నేతలు, అనుచరులతో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే శుక్రవారం సుదీర్ఘంగా చర్చించారు. ‘సేన భవన్’లో ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక నేతల అభిప్రాయాలు తెలుసుకున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన్యతను సంతరించుకుంది.