జాతీయ వార్తలు

అదో ‘ఉగ్రదాడి’: రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్ల క్రితం ఇదే రోజున ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలు చేసిందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ‘ఉగ్రదాడి’గానే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, అన్నిరకాలుగాను వ్యాపార, వర్తక, పారిశ్రామిక వర్గాలు నష్టపోయాని పేర్కొన్నారు. 1330లో మహమ్మద్ బీన్ తుగ్లక్ కరెన్సీని నిరుపయోగమంటూ తీసుకున్న నిర్ణయంతో పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని రాహుల్ సరిపోల్చారు. మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని మూడేళ్లయినా దాని ప్రభావ తీవ్ర ఇంకా తగ్గలేదని పేర్కొన్న ఆయన ఈ నిర్ణయ పర్యవసానాలపై అధికారంలో ఉన్న వ్యక్తులు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని హెచ్చరించారు. ఈ ఘోర నిర్ణయానికి పాల్పడ్డ వ్యక్తులను తగిన విధంగా దండించాల్సిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ మూడేళ్ల క్రితం మోదీ సర్కారు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల సమాజంలో అనేక దుష్పరిణామాలు తలెత్తాయని, ఆ నిర్ణయం దేశానికి ఓ పెనువిపత్తుగానే పరిణమించిందని ధ్వజమెత్తారు. అన్ని రకాల దురన్యాయాలకు, అరాచకాలకు విరుగుడంటూ 2016 నవంబర్ 8న 1,000, 500 రూపాయల కరెన్సీని మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని, కానీ ఇంతవరకూ దానివల్ల దానివల్ల కలిగిన ప్రయోజనం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదని ప్రియాంక పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం వల్లించిన పలుకులు కూడా నిస్సారంగా మారిపోయాయని తెలిపారు. అయినప్పటికి కూడా ఈ నిర్ణయ పర్యవసానాలకు బాధ్యత తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని గర్హించిన కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ప్రధాని మోదీని ‘నేటి తుగ్లక్’గా అభివర్ణించారు. 1330లో అప్పటి పాలకుడు మహమ్మద్ బీన్ తుగ్లక్ కరెన్సీని రద్దు చేశారని, 2016 నవంబర్ 8న నేటి తుగ్లక్ ఆ తరహా నిర్ణయానే్న తీసుకున్నారంటూ సుర్జేవాలా వ్యంగ్యోక్తులు విసిరారు. మోదీ సర్కారు నిర్ణయం వల్ల సామాన్యుడు అవస్థలకు గురికావడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ పతనమైందని, నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు. ఎంతో ఘనంగా చెప్పుకున్న ఈ నిర్ణయం వల్ల ఒరిగిందేమీ లేదని పేర్కొన్న ఆయన ‘ఉగ్రవాదం ఆగలేదు, నకిలీ కరెన్సీ ప్రవాహం తగ్గలేదు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు చెందిన మరో నాయకుడు శశిధరూర్ మాట్లాడుతూ ‘అన్ని గోల్స్‌కు మించిన స్థాయిలో మోదీ ప్రభుత్వం సొంత గోల్ చేసుకుంది’ అని అన్నారు. మూడీస్ వంటి అంతర్జాతీయ ఏజన్సీలు భారత రేటింగ్‌ను తగ్గిస్తున్నాయంటే ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ అన్నారు.