జాతీయ వార్తలు

కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు రూ. 820 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: కాంగ్రెస్ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల శాసన సభల ఎన్నికల కోసం మొత్తం 820 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ సమర్పించిన 2019 ఎన్నికల ఖర్చు లెక్కల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో ప్రచారం, ఇతర పనుల కోసం 820 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఈసీకి వివరించింది. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం 516 కోట్లు ఖర్చు చేసిన కాంగ్రెస్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అదనంగా మూడు వందల నాలుగు కోట్లు ఖర్చు చేయటం గమనార్హం. రూ. 820 కోట్ల నుంచి దాదాపు 626 కోట్ల రూపాయలను ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసిన కాంగ్రెస్ ఇందులో నుంచి 573కోట్ల రూపాయలను చెక్కు రూపంలో చెల్లించింది. 14.33 కోట్ల రూపాయలను నగదు రూపంలో ఇచ్చింది. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం వివిధ వార్తా పత్రికలు, టీవీల్లో ప్రచారం కోసం 356 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఈసీకి స్పష్టం చేసింది. ఎన్నికల పోస్టర్లు, ప్రచార సామాగ్రి కోసం 47 కోట్లు, స్టార్ ప్రచారకుల ప్రయాణాల కోసం 856 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కాంగ్రెస్ తెలిపింది. చత్తీస్‌గఢ్‌లో 40 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో 36 కోట్లు, మహారాష్టల్రో 18 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో 15 కోట్లు, కేరళలో 13 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ వివరించింది. ఇదిలా ఉంటే బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల ఖర్చు లెక్కలను ఇంత వరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవటం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ 83.6 కోట్లు, బీఎస్పీ 55.4 కోట్లు, ఎన్‌సీపీ 72.3 కోట్లు, సీపీఎం 73 లక్షలు ఖర్చు చేశాయి.