జాతీయ వార్తలు

కాలుష్య నివారణకు నడుం బిగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: ఢిల్లీలో కాలుష్య నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో, ఈ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నది. కాలుష్య కారకాలను గుర్తించి, వాటిని ఈనెల 13వ తేదీలోగా తొలగించాలని వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ విజయ్ కుమార్ దేవ్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ కారిడార్లలో ఆక్రమణలను తొలగించడం, కూల్చివేత వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించడం వంటి చర్యలను ముమ్మరం చేయాలని కోరారు. అదే విధంగా చెత్తాచెదారాన్ని తొలగించాలని సూచించారు. చెత్తను తగలబెట్టడం కూడా కాలుష్యానికి ఒక కారణమని సుప్రీం అభిప్రాయపడడంతో, ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించాలని విజయ్ దేవ్ పేర్కొన్నారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ), పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ), ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీఎస్‌ఐఐడీసీ), నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ), న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రో ల్ డిపార్ట్‌మెంట్ తదితర శాఖలకు రాసినలేఖల్లో, రోడ్డు పక్కన ఉండే చెత్తాచెదారం, శిథిలాలను తొలగించాలని ఆదేశించారు.
అదే విధంగా ఖాళీగా ఉన్న స్థలాల్లో చెత్తాచెదారు, వ్యర్థాలను పారవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యమునా నది ఒడ్డున కూడా ఇష్టానుసారంగా చెత్తను పడవేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. ఈ నెల 13వ తేదీలోగా సమస్త చర్యలు చేపట్టి, నివేదికలను అందించాలని ఆదేశించారు. ఢిల్లీలో తీవ్ర స్థాయికి చేరిన కాలుష్యాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించడానికి సుప్రీం కోర్టు చేసిన సూచనలు, జారీ చేసిన ఆదేశాలను పాటించే దిశగా కేంద్ర, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు మొదలుపెట్టాయి. ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ విజయ్ దేవ్ ఆదేశాలు ఇందులో భాగమే.