జాతీయ వార్తలు

‘మహా’ సర్కార్ మరికొంత ఆలస్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 9: అయోధ్యపై సుప్రీం తీర్పు నేపథ్యంలో మహారాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు జాప్యం తప్పదని శివసేన నేత సంజయ్ రౌత్ సంకేతాలిచ్చారు. అయోధ్యలోని వివాదాస్పద భూమిలో రామమందిరం నిర్మించుకోవచ్చని, మసీదు కట్టుకోడానికి అయోధ్యలోనే మరోచోట ఐదేకరాలు స్థలం కేటాయించాలని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. మసీదు నిర్మించుకోడానికి సున్నీ వక్ఫ్‌బోర్డుకు స్థలం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేశారు. దీనిపై శివసేన నేత రౌత్ ట్వీట్ చేశారు. ‘పెహలే మందిర్ ఫిర్ సర్కార్!! అయోధ్య మే మందిర్..మహారాష్ట్ర మే సర్కార్..జై శ్రీరాం’అంటూ ట్వీట్ చేశారు. మరోరెండు రోజులు అయోధ్యపైనే దృష్టంతా..ప్రభుత్వం ఏర్పాటు తరువాత అని ఓ వార్తా సంస్థతో ఆయన అన్నారు. ఇలా ఉండగా మహారాష్ట్ర 13 అసెంబ్లీ గడువుశనివారంతో ముగిసింది. ఈలోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉండగా బీజేపీ-శివసేన మధ్య వివాదం తేలలేదు. అసెంబ్లీలో 288 స్థానాలుండగా బీజేపీ-శివసేనకు 161 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం రెండు పార్టీలూ పట్టుబట్టడంతో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ నడుస్తోంది. బీజేపీ-శివసేనకే ప్రజలు ఎక్కువ సీట్లు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం ఆ కూటమే ఏర్పాటు చేయాలని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ చెబుతున్నారు. తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఆయన ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఎన్‌సీపీ ఆసక్తిగా గమనిస్తున్నట్టు పవార్ శనివారం చెప్పారు. కాగా పీసీసీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరత్ సీడబ్ల్యూసీ సమావేశం నిమిత్తం ఢిల్లీలో ఉన్నారు.