జాతీయ వార్తలు

ఇది నవోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: అయోధ్య అంశంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ఓ నవశకానికి నాంది పలికిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ తీర్పును ఎవరు కూడా విజయంగా లేదా పరాజయంగా భావించడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. సర్వోన్నత న్యాయ స్థానం తీర్పును సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఆమోదించడాన్ని బట్టి చూస్తే భిన్నత్వంలో ఏకత్వం అన్నది మరోసారి నిగ్గు తేలినట్లయ్యిందని మోదీ తెలిపారు. రాజకీయంగాను, మతపరంగాను ఎంతో కీలకమైన ఈ కేసులో సుప్రీం తీర్పు వెలువడిన అనంతరం శనివారం జాతిని ఉద్ధేశించి మాట్లాడిన మోదీ 1989 నవంబర్ 9న బెర్లిన్ గోడ కూల్చివేత ఉదంతాన్ని ఉటంకించారు. అలాగే కర్తార్‌పూర్
కారిడార్ ప్రారంభోత్సవ అంశాన్ని కూడా ప్రస్తావించిన ఆయన ‘ఈ రోజు ఈ పరిణామాలు అందించిన సందేశం సమైక్యంగా కలిసి ముందుకు సాగాలన్నదే’ అని అన్నారు. బెర్లిన్ గోడ కూల్చి వేత రెండు పరస్పర సిద్ధాంతాలను ఏకం చేసిందని అలాగే కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణంలో భారత్-పాకిస్తాన్‌లు క్రియాశీలకంగా పని చేశాయని మోదీ గుర్తు చేశారు. భయం, ద్వేషం, ప్రతికూల భావనలు వదిలి నవ భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సమైక్యంగా ఉండడం, సమైక్యంగా ఎదగడంలో ఉన్న శక్తిని అయోధ్యపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు స్పష్టం చేస్తోందని, కలిసి కట్టుగానే విజయం సాధించాలన్న భావనకు ఇది అధ్దం పట్టిందని మోదీ తెలిపారు. వందలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదాన్ని రోజు వారీగా విచారించి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సుప్రీం కోర్టు ఈ తీర్పును వెలువరించిందని భారత జ్యుడిషీయరీకి సంబంధించినంత వరకూ ఇదో సువర్ణ దినమని మోదీ పేర్కొన్నారు.
అత్యంత ధృడచిత్తంతో వ్యవహారించినందుకు న్యాయమూర్తులను, న్యాయస్థానాలను, న్యాయప్రక్రియను కూడా అభినందించాల్సిందేనని అన్నారు. అయోధ్య వివాదం అనేక తరాల ప్రజలను దెబ్బతీసిందని పేర్కొన్న మోదీ తాజా తీర్పు నేపథ్యంలో కొత్త తరాలన్నీ సరికొత్త స్పూర్తితో పని చేసేలా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. అలాగే నేటి పరిణామంతో భారత దేశ ప్రజాస్వామ్య శక్తి ప్రపంచ దేశాలకు మరోసారి స్పష్టమైందన్నారు.
*చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ