జాతీయ వార్తలు

ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 9: మహారాష్ట్ర లో కొత్త ప్రభు త్వం ఏర్పాటుకు మార్గం సుగమమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. 15రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన తొలగిపోతుందన్న ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను, సమర్థతను తెలియజేయాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్‌యారి శనివారం సాయంత్రం సూచించారు. దీంతో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు బీజేపీ కోర్ కమిటీ ఆదివారం సమావేశం అవుతుందని ఆ పార్టీ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు.
ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడంపై బీజేపీతో పోరాడుతున్న ఆ పార్టీ మిత్రపక్షం శివసేన కూడా గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించింది. శనివారం అంతకుముందు అడ్వకేట్ జనరల్ అషుతోశ్ కుంభకోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 13వ అసెంబ్లీ కాలపరిమితి శనివారం అర్ధరాత్రితో ముగుస్తోంది. ‘మేము ఇప్పుడే గవర్నర్ నుంచి లేఖ అందుకున్నాం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన చంద్రకాంత్ పాటిల్ ఒక వార్తాసంస్థకు తెలిపారు. బీజేపీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను, సమర్థతను తెలియజేయాల్సిందిగా ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు అయిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు గవర్నర్ సూచించారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
తొలి కథనాలు..
ఇదిలా ఉండగా మహారాష్ట్ర లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రతిష్ఠంభన అంతూ పొంతూ లేకుండా కొనసాగుండడంతో అసెంబ్లీని తదుపరి చర్యల వరకు సుప్తచేతనావస్తలో ఉంచే అవకాశం కనిపిస్తోందంటూ తొలి కథనాలు వెలువడ్డాయ. మళ్లీ గవర్నర్ అసెంబ్లీని సమావేశపరిచే వరకు ఇదే స్థితిలో దీనిని కొసాగించే అవకాశం ఉందని చెబుతున్నారు. 13వ మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శనివారం అర్ధరాత్రితో ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేనకు మెజారిటీ వచ్చినప్పటికీ పదవుల పంపకంలో విభేదాలు తలెత్తడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటే ప్రశ్నార్థకంగా మారింది. అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి శనివారం రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలుసుకుని తాజా పరిస్థితులపై చర్చలు జరిపారు. ఇంతకుముందు కూడా ఆయన గవర్నర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని పట్టుబడుతున్న శివసేన ఉద్ధవ్ థాకరే శనివారం అయోధ్య అంశంపై మీడియాతో మాట్లాడినప్పటికీ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అంశంపై దాటవేశారు. ‘ప్రభుత్వం ఎలాగైనా ఏర్పడుతుంది. ఆందోళన వద్దు. ఈరోజు మనకు ఎంతో ఆనందకరమైన రోజు’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీమానాను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరారు. కొత్త అసెంబ్లీని గవర్నర్ పిలిచేవరకు అది సుప్తచేతనావస్థలో ఉంటుందని మహారాష్ట్ర శాసనసభ మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి అనంత్ కాల్‌సే తెలిపారు. ఎంతకాలం ఈ స్థితిలో అసెంబ్లీని కొనసాగనివ్వచ్చన్న దానిపై కాలవ్యవధి ఏమీ లేదని, కొత్త అసెంబ్లీని గవర్నర్ సమావేశపరిచేవరకు ఇలాగే ఉంటుందని అన్నారు. అయితే, ఈ కాలంలో కొత్త ఎమ్మెల్యేలకు జీతాలు, ఇతర ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మెజారిటీ సాధించిన పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. ఎన్నికల్లో అత్యధిక స్థాయిలో సీట్లను గెల్చుకున్న పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోతే గవర్నరే ఆహ్వానించాలని, లేనిపక్షంలో రెండో స్థానంలో, మూడో స్థానంలో ఉన్న పార్టీలను సర్కారు ఏర్పాటుకు పిలవాలని కాల్‌సే తెలిపారు. అయితే, రాష్టప్రతి పాలన విధించడం అన్నది ఇతర మార్గాలన్నీ మూసుకుపోయిన తర్వాతే జరిగే ప్రయత్నమని అన్నారు. మంత్రివర్గం సిఫార్సు చేయకపోతే కొత్త అసెంబ్లీని గవర్నర్ సమావేశపరచలేరని, అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వమే లేదని అన్నారు. 288 సీట్లు కలిగిన అసెంబ్లీలో 105 స్థానాలు గెల్చుకుని బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది.