జాతీయ వార్తలు

బీజేపీ శక్తి, యుక్తి ‘అయోధ్య’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో నామమాత్ర మనుగడే కొనసాగించిన బీజేపీ అత్యంత ప్రబలమైన శక్తిగా మార్చింది రామజన్మ భూమి ఉద్యమమే. లోక్‌సభలో అతి తక్కువ స్థానాల నుంచి తిరుగులేని అధికారాన్ని ఆ పార్టీ నేడు సంతరించుకోవడానికి ఆ ఉద్యమ పునాదులే బలమైన ప్రేరణ అందించాయి. 1989 పాలంపూర్‌లో అయోధ్యలో ఆలయ నిర్మాణానికి సంబంధించి చేపట్టిన తీర్మానం అనంతర కాలంలో రామజన్మ భూమి ఉద్యమంగా ఊపిరిపోసుకుంది. హిందుత్వం మూడు దశాబ్దాలుగా బీజేపీ విధానాలు, ఆలోచనలను ప్రభావితం చేసింది.
1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలతో చేతులు కలిపిన బీజేపీ ఏకంగా 85 సీట్లను గెలుచుకోగలిగింది. అంతకుముందు 1984 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకు పరిమితమైన బీజేపీకి అయోధ్య అంశం రాజకీయంగా తిరుగులేని శక్తిని అందించింది. 1990లో కూడా అప్పటి మండల్ కమిషన్ నివేదిక కూడా బీజేపీని రాజకీయంగా ఆదుకుంది. క్రమంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చింది. గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయం నుంచి అద్వానీ చేపట్టిన యాత్ర బీజేపీకి రాజకీయంగా నిర్ణయాత్మకమైంది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు విధ్వంసంతో కొంతకాలంపాటు బీజేపీ అంటరాని పార్టీగానే మారినప్పటికీ అనంతర కాలంలో పుంజుకుంది. అప్పట్లో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్రగానీ, నేతల వారసత్వంగానీ బీజేపీకి లేవని, అందుకే అయోధ్య ఉద్యమానే్న హిందుత్వానే్న అజెండాగా చేసుకుని తన ఉనికిని చాటుకుందని విశే్లషకులు చెబుతున్నారు. రాముడే ఆయుధంగా బీజేపీ రాణించిందని, హిందూ మెజారిటీ రాజకీయాలను తెరపైకి తెచ్చిందని వారు స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతి, రామాలయ నిర్మాణం అంశాలు హిందులను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీకి అనుకూలంగా మారాయి. ముఖ్యంగా 1990 దశకం ద్వితీయార్థంలో బీజేపీకి రాజకీయంగా కలిసివచ్చే పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీ రాజకీయంగా తనకు అనుకూలమైన హిందుత్వ అజెండాను బలోపేతం చేసుకుంటూ వచ్చింది. అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. రామజన్మ భూమి వివాదం కొనసాగినట్టుగా ఏ నాగరిక చరిత్రలోనూ మరెలాంటి ఉద్యమం సాగలేదని విశే్లషకులు చెబుతున్నారు.
1983లో మొదలైన ఈ ఉద్యమం భారతదేశానికి ఓ గుర్తింపు ఇవ్వడమే కాకుండా జాతీయ జీవనంలోని అన్ని పార్శ్వాలను ప్రభావితం చేసిందని ఆరెస్సెస్‌పై పలు పుస్తకాలు రాసిన రాజకీయ విశే్లషకుడు అరుణ్ ఆనంద్ తెలిపారు. 1528 నుంచి అయోధ్యలో తమ భూభాగం కోసం హిందువులు పోరాడుతూనే వచ్చారని, 1883-84లో ఆ డిమాండ్ ఉద్యమ రూపు దాల్చిందని ఆయన గుర్తు చేశారు.