జాతీయ వార్తలు

బెంగాల్ ‘బుల్‌బుల్’ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తీర ప్రాంతాల్లో బుల్‌బుల్ తుపాను బీభత్సం సృష్టించింది. వర్షాలు, ఈదురుగాలులకు ఆదివారం ఒక్క రోజే ఏడుగురు మృత్యువాత పడ్డారు. దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. బుల్‌బుల్ తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యంగా కోల్‌కతాతో పాటు పొరుగున ఉన్న ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిద్నాపూర్ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క ఉత్తర పరగాణాల జిల్లాలోనే ఐదుగురు మరణించినట్లు సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు. పర్బా గ్రామంలో 70 ఏళ్ల సుచిత్ర మండల్ అనే వృద్ధురాలు చెట్టు మీదపడి మరణించింది. మృతిచెందిన వారిలో రేబా విశ్వాస్ (47), మనిరుల్ గజీ (59) ఉన్నారు. వీరు విద్యుదాఘాతంతో మృతి చెందారు. మరొకరు గూడ కూలి ఒకరు, చెట్లు మీదపడి మరొకరు చనిపోయారు. తూర్పు మిద్నాపూర్‌లో చెట్టు మీదపడి ఒకరు మరణించారు. దేవదారు వృక్షం మీదపడడంతో ఒక ఉద్యోగి మరణించాడు. కోల్‌కతా నగరం సైతం బుల్‌బుల్ తుపాను తీవ్రతకు చిగురుటాకులా వణికిపోయింది. వర్షం తీవ్రతకు ఎవరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. మధ్యాహ్నం దాటిన తరువాత తుపాను తీవ్రత కొంతమేర తగ్గుముఖం పట్టింది. ఈదురుగాలులకు భారీ వృక్షాలు సైతం నేలకూలడంతో యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించేందుకు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా కృషి చేశాయి. విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి జావెద్ ఖాన్ మాట్లాడుతూ కూలిన చెట్లు, స్తంభాలను తొలగించి రోడ్ల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశామనీ, రాత్రి కల్లా రహదారులు క్లియర్ అవుతాయని చెప్పారు. ఈశాన్య బెంగాల్‌లో బుల్‌బుల్ తీపాను తీవ్రత తగ్గిందనీ పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటి సుందర్బన్ దంచి అటవీ ప్రాంతంవైపు పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాత్రి ఎనిమిదిన్నర నుంచి 11.30 గంటల మధ్య 110 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. రానున్న ఆరు గంటల్లో తుపాను తీవ్రత బాగా తగ్గి స్వల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి నష్టం అంచనా వేయనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలియజేశారు.
కేంద్రం భరోసా
బుల్‌బుల్ తుపాను తీవ్రతగా నష్టపోయిన పశ్చిమ బెంగాల్‌ను ఆదుకొనేందుకు అవసరమైన అన్ని చర్యను తీసుకొంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చరు. సహాయ, పునరావాస చర్యలకు అవసరమైన నిధులు అందిస్తామని వివరించారు. పశ్చిమ బెంగాల్‌కు పది ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, ఒడిశాకు ఆరు బృందాలను పంపినట్లు షా తెలియజేశారు. మరో 18 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఈశాన్య భారతావనిలో తుపాను నష్టంపై సమీక్షించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వటర్‌లో పేర్కొన్నారు. కేంద్రం నుంచి అవసరమైన అన్ని సహాయాన్ని అందజేస్తామనీ, అంతా సురక్షితంగా ఉండాలని కోరుకొంటున్నానని మమతకు మోదీ తెలియజేశారు.