జాతీయ వార్తలు

మా వల్ల కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 10: మహారాష్టల్రో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం ఆదివారం ఆసక్తికర మలుపు తిప్పింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ నాయకుడు ఫడ్నవీస్‌ను గవర్నర్ కొషియారి ఆహ్వానించడంతో వ్యవహారం కొలిక్కి వస్తుందన్న ఆశలు అడుగంటాయి. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆసక్తి కానీ, సామర్థ్యం కానీ లేదని స్పష్టం చేసిన బీజేపీ వెనక్కి తగ్గింది. దీంతో రెండో అతిపెద్ద పార్టీగా శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. ఇందుకోసం శుక్రవారం రాత్రి ఏడున్నర వరకు గడువు విధించారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో? లేదో? చెప్పాలంటూ శివసేన శాసనసభాపక్ష నాయకుడు ఏక్‌నాథ్ షిండేను స్పష్టం చేయాలని గవర్నర్ ఆదేశించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఎప్పుడైతే గవర్నర్ నుంచి తమకు ఆహ్వానం అందిందో శివసేన కొత్త ఎమ్మెల్యేలు చర్చల్లో తలమునకలయ్యారు. అనంతరం పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. ఈ పరిణామాలన్నీ కూడా ప్రతిపక్ష కూటమి కాంగ్రెస్, ఎన్‌సీపీలు క్రియాశీలక భూమిక పోషించడానికి ఆస్కారం ఇస్తున్నాయి. 288 స్థానాలు కలిగిన రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది మద్దతు కావాలి. కేవలం 56 మంది ఎమ్మెల్యేలు కలిగిన శివసేనకు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే అవకాశం ఎంతమాత్రం లేదు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 44 మంది, ఎన్‌సీపీకి 54 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఈ కూటమి మద్దతు తప్పనిసరి. ఈ మూడు పార్టీలూ కలిస్తే అసెంబ్లీలో బలం 154కు పెరుగుతుంది. శివసేనకు మద్దతు ఇవ్వాలంటే ముందు బీజేపీతో అది తెగతెంపులు చేసుకోవాలని శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఫడ్నవీస్.. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే శక్తి లేదని.. అవసరమైన సంఖ్యాబలం లేదని గవర్నర్‌కు వివరించారు. ముఖ్యమంత్రి పదవి తమకిస్తేనే బీజేపీకి మద్దతు ఇస్తామని తెలిపిన శివసేన.. తాజా పరిస్థితుల్లోనూ దానికే కట్టుబడి ఉందని ఆ పార్టీ నాయకుడు సంజయ్ రావు తెలిపారు. ప్రజలు తమకు మెజారిటీ కట్టబెట్టినా కూడా దానిని శివసేన కాలరాస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. ప్రజా తీర్పును ఉద్ధవ్ థాకరే అగౌరవపరుస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ రౌత్ విమర్శించారు. ఒకవేళ కాంగ్రెస్-ఎన్‌సీపీల మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని శివసేన ఏర్పాటు చేసినా అది ఎంతోకాలం ఉండదని బీజేపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
*చిత్రం... ముంబయిలో ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారితో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత పాటిల్ తదితరులు