జాతీయ వార్తలు

మాజీ సీఈసీ టిఎన్ శేషన్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ తిరునెల్లాయ్ నారాయణ అయ్యర్ శేషన్ (87) ఆదివారం కన్నుమూశారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11వరకూ ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పని చేశారు. 1955లో తమిళనాడు కేడర్ నుంచి ఐఎఎస్‌కు ఎంపికైన శేషన్ 1989లో కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా కూడా పని చేశారు. ప్రభుత్వ పదవుల్లో విశేషమైన సేవలందించినందుకు 1996లో ప్రతిష్టాత్మక రామన్ మెగసెసె పురస్కారాన్ని కూడా ఆయన పొందారు. కేరళలోని పలక్కడ్ జిల్లా తిరునెల్లాయ్ 1932లో జన్మించిన శేషన్ భౌతిక శాస్త్రంలో పట్టా తీసుకున్నారు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో డెమాన్‌స్ట్రేటర్‌గా మూడేళ్లు పని చేసిన శేషన్ 1955లో ఐఎఎస్‌కు ఎంపికయ్యారు. ఎడ్వర్డ్ ఎస్ మాసన్ ఫెలోషిప్‌పై హార్వార్డ్ యూనిర్శిటీలో చదువుకున్న ఆయన పాలనా వ్యవస్థకు సంబంధించి అక్కడే మాస్టర్స్ డిగ్రీ పొందారు. తనదైన శైలిలో ఎన్నికల కమిషన్‌ను ముందుకు నడిపిన శేషన్ తన అనంతరం ఈ పదవులు నిర్వహించిన ఎందరికో మార్గదర్శకుడయ్యారని, ఆయన లేరన్న విషయం తీవ్ర విచారాన్ని కలిగిస్తోందని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ అన్నారు.
* మాజీ సీఈసీ టిఎన్ శేషన్ (ఫైల్‌ఫొటో)