జాతీయ వార్తలు

హర్యానా కేబినెట్ విస్తరణ రేపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, నవంబర్ 10: మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా కేబినెట్ తొలి విస్తరణ మంగళవారం జరిగే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గంలో కొత్తగా చేరేవారి పేర్లను ఆదివారం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 65 ఏళ్ల ఖట్టర్ అక్టోబర్ 27న రెండోసారి ముఖ్యమంత్రిగా, దివంగత మాజీ ఉప ప్రధాన మంత్రి దేవీలాల్ ముని మనుమడు 31 ఏళ్ల దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దుష్యంత్ నేతృత్వంలోని జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ) సహాయంతో బీజేపీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. కేంద్ర హోంమంత్రి, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో ఢిల్లీలోని ఆయన నివాసంలో ఖట్టర్ ఆదివారం చాలాసేపు సమావేశమయినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. మరికొందరు బీజేపీ సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపిన తరువాత కేబినెట్‌లో చేర్చుకునే వారి పేర్లకు తుదిరూపం ఇచ్చినట్టు ఆ వర్గాలు తెలిపాయి. సంకీర్ణ భాగస్వామి జేజేపీని కూడా ఈ విషయంలో విశ్వాసంలోకి తీసుకున్నట్టు ఆ వర్గాలు చెప్పాయి. అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే కొత్త మంత్రులు సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ 550వ జయంతి అయిన నవంబర్ 12వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తారని ఆ వర్గాలు వివరించాయి. ఖట్టర్, చౌతాలా దీపావళి రోజు ప్రమాణస్వీకారం చేశారు.