జాతీయ వార్తలు

ప్రత్యేకంగా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్ధితి దయనీయంగా ఉందని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూడాలని.. రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బుగ్గన వివరించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు కేంద్ర సహకారం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు తదితర అంశాలపై కేంద్ర మంత్రికి పలు విజ్ఞప్తులు సమర్పించినట్టు తెలిపారు. గత తెలుగుదేశం పాలనలో అప్పులు పెరిగిపోయాయని.. ఆ అప్పులన్నీ తీర్చాల్సి ఉన్నందున.. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. సాధారణ పరిపాలనను కొనసాగించడానికి కూడ ఇబ్బందులు పడే పరస్థితికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గత ప్రభుత్వం దాదాపు రూ. 40,000కోట్ల
పెండింగ్ బిల్లులను పెట్టి వెళ్లిందని, కొత్తగా అప్పు చేసేందుకు కూడా అవకాశం లేకుండా చేసిందని మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రాష్ట్రంగా ‘ఆంధ్రప్రదేశ్’ను చూడాలని కేంద్ర మంత్రిని కోరినట్టు చెప్పారు. తాము చేసిన విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఇవ్వాల్సిన దానిలో రూ.1850 కోట్లు కేంద్రం విడుదల చేసిందని, మిగిలినవి కూడా ఇస్తారని కేంద్రం తెలిపిందన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, బోధనా రుసుముల చెల్లింపు, వృద్ధాప్య పింఛను, వాహన మిత్ర పథకాలు అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చెశారు. రైతు భరోసా కింద రైతులు కట్టాల్సిన బీమాను ప్రభుత్వమే చెల్లిస్తుందని, దీనివల్ల బీమా చేసే రైతుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. ఇసుక కొరత ములంగా భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారనేది వాస్తవం కాదని అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వేరే కారణాలు దొరక్క ఏదొక్కటే చెబుతున్నారని బుగ్గన మండిపడ్డారు. వైఎస్సార్ ప్రభుత్వంపై చంద్రబాబు అనవసర రాజకీయాలు చేయడం తగదని అన్నారు.
*చిత్రం...రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్