జాతీయ వార్తలు

సోనియా కుటుంబానికి సీఆర్‌పీఎఫ్ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యా గాంధీ, ఆమె కుమారుడు, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీలకు సీఆర్‌పీఎఫ్ బలగాల భద్రత సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ మినహా సోనియా కుటుంబంతో పాటు ముఖ్య నేతలందరికీ ఎస్‌పీజీ భద్రతను కేంద్ర హోం శాఖ గత వారం ఉపసంహరించిన సంగతి తెలిసిందే. ఎస్‌పీజీ భద్రతను కుదిస్తూ జారీ చేసిన ఆదేశాలు అందరికీ అమల్లోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సాయుధ పారా మిలిటరీ బలగాలు ఇజ్రాయెలీ ఎక్స్-95, ఏకే సిరీస్, ఎంపీ-5 గన్స్‌తో సోనియా కుటుంబానికి భద్రత కల్పించారు. ఈమేరకు సోనియా నివాసం 10, జన్‌పథ్ వద్ద, తుగ్లక్ లేన్‌లోని వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ నివాసం వద్ద, లోధి ఎస్టేట్‌లోని ప్రియాంక గాంధీ నివాసం వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలు బాధ్యతలు స్వీకరించాయి. కేంద్ర హోం శాఖ ఉత్తర్వుల మేరకు ఎస్పీజీ భద్రతను కుదించి సీఆర్‌పీఎఫ్ బలగాల భద్రతను ‘జెడ్ +’ కేటగిరీ కింద దేశ వ్యాప్తంగా గాంధీ కుటుంబం ఎక్కడికి వెళ్లినా ఈ రకమైన భద్రత అమలు కానుంది. ఉత్తర్వుల మేరకు గాంధీ కుటుంబం ఏ ప్రాంతానికి వెళ్లినా ముందస్తుగా భద్రతా చర్యల కింద తనిఖీలను నిర్వహించిన తరువాత వీరి పర్యటన ప్రారంభవౌతుంది. సోనియా, రాహుల్, ప్రియాంకల నివాసాల వద్ద నిరంతర నిఘా సీఆర్‌పీఎఫ్ భద్రత కింద వచ్చేలా ఆదేశాలు వెలువడ్డాయి. దేశ రాజధానితో పాటు ఇతర రాష్ట్రాల్లో వీరి కుటుంబ భద్రత నిమిత్తం సీఆర్‌పీఎఫ్ బలగాలకు వీవీఐపీ కేటగిరీ కింద చర్యలు చేపట్టడానికి కొంతకాలం ఢిల్లీ పోలీసుల సహాయంతో ఎస్‌పీజీ బృందాలు తర్ఫీదునిస్తాయి. 1991లో శ్రీపెరంబదూరులో రాజీవ్ గాంధీ హత్యోదంతం అనంతరం ఈ కుటుంబానికి ఎస్‌పీజీ భద్రతను కొనసాగిస్తూ వచ్చినప్పటికీ.. రాజీవ్ అమలు చేసిన సీఆర్‌పీఎఫ్ భద్రతనే వీరికీ వర్తింపజేయాలని కేంద్రం గత వారం నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 28 సంవత్సరాల అనంతరం ఈ కుటుంబానికి భద్రతను కుదించినట్లయ్యింది.