జాతీయ వార్తలు

ఢిల్లీ జేఎన్‌యూలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 11: వసతి గృహాల ఫీజులను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ హస్తినలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యు) విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు-పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మరోవైపు జేఎన్‌యు స్నాతకోత్సవానికి హాజరైన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి (హెచ్‌ఆర్‌డి) రమేష్ పొక్రియల్ ‘నిశాంక్’ను విద్యార్థులు అడ్డుకోవడంతో ఆయన సుమారు 6 గంటల పాటు వర్సిటీ ఆవరణలోనే ఉండిపోయారు.
అసలేం జరిగిందంటే: జేఎన్‌యు వసతి గృహాల ఫీజును అమాంతం పెంచడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇలాఉండగా సోమవారం ఉదయం స్నాతకోత్సవాన్ని వర్సిటీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా, కేంద్ర మంత్రి రమేష్ పొక్రియల్ ప్రభృతులు అతిథులుగా హాజరయ్యారు. అప్పటికే చాలా మంది విద్యార్థులు యూనివర్సిటీ హాస్టల్ ఫీజు పెంచడాన్ని నిరసిస్తూ ప్ల-కారులు పట్టుకుని స్నాతకోత్సవం జరుగుతున్న ప్రాంతానికి పాదయాత్రగా బయలుదేరారు. వర్సిటీ ఆవరణలో జరుగుతున్న స్నాతకోత్సవ వద్దకు వెళుతున్న విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒక దశలో విద్యార్థులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని బ్యారికేడ్లను తోసేసి ముందుకు దూసుకుని వెళ్లడంతో పోలీసులకు-విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు విద్యార్థులనుద్ధేశించి ప్రసంగిస్తున్నారు. కాగా పోలీసులు విద్యార్థులను వేదికకు కొద్ది దూరంలో నిలువరించగలిగారు. అయితే ఢిల్లీ పోలీసులు వర్సిటీ వదిలేసి వెనక్కి వెళ్ళాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. వైస్-్ఛన్సలర్ జగదీష్ కుమార్ దొంగ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. వర్సిటీలో డ్రెస్ కోడ్ పెడతామనడాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. విపరీతంగా పెంచిన ఫీజును వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెళ్ళిన తర్వాత విద్యార్థులు మరింతగా ఆందోళనను తీవ్రతరం చేశారు. కేంద్ర మంత్రి రమేష్ పొక్రియాల్ ఆవరణలోనే ఉండిపోయారు. ఆరు గంటల తర్వాత అంటే 4.15 గంటలకు ఆయన వెలుపలికి వచ్చారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి రమేష్ పొక్రియాల్ హామీ ఇచ్చారు.
*చిత్రం... విద్యార్థి వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారని సోమవారం ఢిల్లీలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నిరసన ప్రదర్శన జరుపుతున్న జేఎన్‌యూ విద్యార్థులు.