జాతీయ వార్తలు

స్థూల జాతీయోత్పత్తిలో ఎరువులు, రసాయనాల రంగానిది కీలక భూమిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 11: ఎరువులు, రసాయనాల రంగం వచ్చే ఐదేళ్లలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 300 బిలియన్ డాలర్ల భాగస్వామ్యాన్ని ఇవ్వగలిగే సామర్ధ్యంతో ఉందని ఆ శాఖ కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారు. సోమవారం నాడిక్కడ జరిగిన ‘్భరత రసాయనాల శిఖరాగ్ర సదస్సు’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఐదేళ్లలో దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఎరువులు, రసాయనాల రంగానికి ప్రస్తుతం దేశ తయారీ రంగంలో 7.76 శాతం భాగస్వామ్యం ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇది 20 నుంచి 25 శాతానికి చేరుతుందని, రాబడి రెండింతలై 304 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. 2025 నాటికి దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మారితే అందులో ఎరువులు, రసాయనాల రంగం భాగస్వామ్యం 304 బిలియన్ డాలర్లు ఉంటుందని సదానంద గౌడ్ తెలిపారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం 160 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు. పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని భరోసా ఇస్తూ, పూర్తి స్థాయి సమర్థతతను వినియోగించి అభివృద్థికి కృషి చేయాలని అధికారులు, సిబ్బందికి ఆయన సూచించారు. ప్రభుత్వ విశిష్ట విధానాల ద్వారా అన్ని రంగాల్లో వేగవంతమైన వృద్ధి చోటుచేసుకుంటోందని, తలసరి ఆదాయం సైతం క్రమంగా గణనీయంగా పెరుగుతోందని తెలిపారు.
మధ్య ఆదాయ వర్గాల ద్వారా మార్కెట్లు కూడా వృద్థి చెందుతున్నాయన్నారు. రసాయనాల పరిశ్రమల్లో ప్రతి ఏటా కనీసం 9 శాతం వంతున వచ్చే ఐదేళ్ల కాలంలో చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. కంపెనీలు పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునేలా స్నేహపూర్వక మార్కెట్ విధానాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ప్రత్యేకించి జీఎస్టీ, ఎఫ్‌డీఐ మార్గదర్శకాల సరళీకరణ, కార్మిక చట్టాల సంస్కరణ, బ్యాంకుల మోసాలను అరికట్టే చట్టాలను అమలు చేస్తోందని వివరించారు. ఇలా ప్రభుత్వ పనితీరు వల్ల దేశం ప్రస్తుతం విదేశీ మదుపర్లకు ఆకర్షణీయ గమ్య స్థానంగా మారిందని గౌడ అన్నారు. గడచిన ఐదేళ్ల కాలంలో 280 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు రావడం ఇందుకు నిదర్శనమన్నారు.
ఇప్పటికే నాలుగు పెట్రోలియం, రసాయనాలు, పెట్రోకెమికల్స్ పెట్టుబడుల రీజియన్లను గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, తమిళ్‌నాడుల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతాల నుంచి 8 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించే వీలుందని, అలాగే 4 మిలియన్ల ఉద్యోగాలు కూడా లభిస్తాయని తెలిపారు. ఇదే సభలో రసాయనాలు, పెట్రోకెమికల్స్ శాఖ కార్యదర్శి పీ. రాఘవేంద్ర రావుమాట్లాడుతూ ఇప్పటికీ రసాయనాలు పెద్దయెత్తున మన దేశం దిగుమతి చేసుకుంటోందన్నారు. ఇవి దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాల్సిన అగత్యం ఉందన్నారు.