జాతీయ వార్తలు

చట్టసభల్లో కోటా కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశంలో మహిళల సాధికారతను మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. ముఖ్యంగా పార్లమెంటు, రాష్ట్రాల చట్టసభలో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా వారి ఎదుగుదలకు దోహదం చేయాలని అన్నారు. సోమవారం నాడు ఇక్కడ జరిగిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మూడో స్నాతకోత్సవంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు ఈ విద్యాసంస్థలోని విద్యార్థుల్లో 51 శాతం మంది మహిళలే కావడం తనకెంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు. జేఎన్‌యూలో ఇంతగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం, ఇందుకోసం ప్రత్యేక అడ్మిషన్ విధానాన్ని అవలంబించడమేనని తెలిపారు. అలాగే, పార్లమెంటు, చట్టసభల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా వారి ఎదుగుదలకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే, అంతర్జాతీయ విద్యా కేంద్రంగా భారతదేశ ఔన్నత్యాన్ని పునరుద్ధరించాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే దేశంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు తమ బోధనా విధానాలను పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని, ముఖ్యంగా పరిశోధనలపై ఇవి దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. భారత నాగరికతలోని సమీకృత విద్యా దృక్పథానికి మొదటినుంచి ప్రాధాన్యత కనపడుతూ వచ్చిందని, ప్రస్తుత బోధనా పద్ధతులకు దీనిని అన్వయించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి తెలిపారు. జేఎన్‌యూతోపాటు దేశంలోని ఇతర యూనివర్సిటీలు అంతర్జాతీయ స్థాయిని సంతరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అవసరాలను, ప్రామాణికతను దృష్టిలో పెట్టుకుని సమగ్ర రీతిలో ప్రావీణ్యతను పెంపొందించుకునే లక్ష్యంతో విశ్వవిద్యాలయాలు పరిణతి చెందాలని అన్నారు.

*చిత్రాలు.. స్నాతకోత్సవ ప్రసంగం చేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
*విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు.