జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యం అపహాస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహారాష్టల్రో ఓ పక్క ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్న తరుణంలో ఆకస్మికంగా రాష్టప్రతి పాలన విధించాలని గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ సిఫార్సు చేయడంపై కాంగ్రెస్ నాయకత్వం నిప్పులు చెరిగింది. తన చర్య ద్వారా రాజ్యాంగ ప్రక్రియనే గవర్నర్ అపహాస్యం చేశారని, ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకే విఘాతకరమని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. అసలు ఎన్సీపీ, శివసేన, బీజేపీలకు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆయన ఇచ్చిన గడువు విడ్డూరంగా ఉందని, ఈ వ్యవహారంలో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య, రాజ్యాంగ నిబంధనలను మంటగలపడమేనని సుర్జేవాలా అన్నారు. ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే మహారాష్ట్ర గవర్నర్ ఉల్లంఘించారని, ఈ రాజ్యాంగ ప్రక్రియకు సంబంధించి నాలుగు ప్రధాన నియమాలకు తూట్లు పొడిచారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సొంత మెజారిటీ రాని పక్షంలో గవర్నర్ ఎలా వ్యవహరించాలన్న దానిపై ఎస్‌ఆర్ బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఓ నియమావళిని ఆవిష్కరించిందని ఆయన గుర్తు చేశారు. వీటిలో మొదటిది..ఎన్నికల్లో ముందు పొత్తు పెట్టుకున్న కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం, రెండోది..రెండో అతి పెద్ద కూటమిగా ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలను పిలవడం. ఈ రెండు ప్రయత్నాలనూ గవర్నర్ చేయలేదని సుర్జేవాలా అన్నారు. ఎన్నికల్లో సీట్ల సంఖ్యను బట్టి పార్టీలను పిలవాలని గవర్నర్ భావిస్తే ఎన్సీపీ తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. పైగా, మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయా పార్టీలకు ఆయన ఇచ్చిన గడువు కూడా విడ్డూరంగా, ఇష్టారాజ్యంగా ఉందని అన్నారు. బీజేపీకి 48 గంటలు ఇవ్వడం, శివసేన, ఎన్సీపీలకు 24 గంటలే గడువు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
పైగా, ఎన్సీపీకి ఇచ్చిన గడువు పూర్తి కాకుండానే రాష్టప్రతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు. గవర్నర్ చర్య సిగ్గుచేటని, రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్నదని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ప్రతినిధి అభిషేక్ సింఘ్వి కూడా గవర్నర్ చర్యను తూర్పారపట్టారు. మహారాష్టల్రో విధించినది రాష్టప్రతి పాలన కాదని, దురుద్దేశ పూరితంగా సాగుతున్న బీజేపీ పాలనేనని వ్యాఖ్యానించారు. అసలు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలన్నీ కూడా పూర్తి కాకుండా ఏ ప్రాతిపదికన రాష్టప్రతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేస్తారని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు సచిన్ సావంత్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమకు మద్దతు లేఖలు అందిన వెంటనే రాష్టప్రతి పాలన ఎత్తివేసేందుకు అవకాశం ఉంటుందని సుశీల్ కుమార్ షిండే అన్నారు. మిగతా పార్టీల మాదిరిగానే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని కూడా గవర్నర్ పిలిచి ఉండాల్సిందని మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు.

*చిత్రం... కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా