జాతీయ వార్తలు

జ్ఞానాన్ని సముపార్జించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 12: జీవితాంతం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమం, టెక్స్‌టైల్ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యాభ్యాసం చేయడం అనేది ఒక చోట ఆగిపోదని అన్నారు. విద్యార్థులు జీవితాంతం జ్ఞానాన్ని సముపార్జించుకోవాలని ఆమె సూచించారు. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) మంగళవారం నిర్వహించిన స్నాతకోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసంగిస్తూ విద్యాభ్యాసం చేయడానికి ముగింపు అనేది ఉండదని అన్నారు. విద్యార్థులు కొత్త కొత్త కోర్సుల్లో చేరుతూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. స్నాతకోత్సవం అయ్యింది కాబట్టి తమ విద్యాభ్యాసం పూర్తయ్యిందని భావించరాదని, స్నాతకోత్సవం అయ్యింది అంటే కొత్త కోర్సుకు ‘తెర’ లేచినట్లుగా భావించాలన్నారు. 2006 సంవత్సరంలో 331 రిసెర్చ్ పేపర్లు దేశ వ్యాప్తంగా ప్రచురితమైతే, 2016 సంవత్సరం నాటికి 3,301 ప్రచురితం కావడం గొప్ప విషయమని అన్నారు. స్టార్టప్‌లను పొదిగే అవకాశాలను అనే్వషించాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్థులకు సూచించారు. ‘విట్’లో 1,700 మంది విద్యార్థులు, రిసెర్చ్ స్కాలర్లకు ఆమె సర్ట్ఫికేట్లు, మెడల్స్ అందజేశారు. అంతకు ముందు యూనివర్సిటీ వైస్-చాన్సలర్ జి. విశ్వనాథన్ ప్రసంగిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్య ఉచితంగా అందించాలని కేంద్రాన్ని కోరారు. కనీసం మహిళలకైనా ఆ అవకాశం కల్పిస్తే అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామని ఆయన తెలిపారు.
*చిత్రం...వెల్లూర్ టెక్నాలజీ సంస్థ (వీఐటీ) వార్షిక స్నాతకోత్సవం సందర్భంగా మంగళవారం విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ