రాష్ట్రీయం

‘పటిష్ఠ’ వ్యూహంపై కాంగ్రెస్ చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్ఠం చేసేందుకు అనుసరించవలసిన వ్యూహంపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ సోమవారం సాయంత్రం తమ నివాసంలో సిఎల్‌పి నాయకుడు కె జానారెడ్డి, విధాన మండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు షబ్బీర్ అలీ, పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్కతో సమాలోచన జరిపారు. దిగ్విజయ్ సింగ్ ముగ్గురు నాయకులతో విడివిడిగా చర్చలు జరపటం గమనార్హం. ఇటీవల రాష్ట్ర శాసనసభలో పార్టీ వ్యవహరించిన తీరు, పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్‌లో చేరటం, మరికొందరు చేరేందుకు సిద్ధపడటంపై దిగ్విజయ్ సింగ్ ఆరా తీసినట్లు తెలిసింది. సిఎల్‌పికి చెందిన కొందరు నాయకులు రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యారంటూ వస్తున్న ఆరోపణల గురించి కూడా దిగ్విజయ్ సింగ్ అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. ఇటీవల జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ ఓటమికి అసలైన కారకులపై చర్చ తీసుకోకుండా ఎలాంటి సంబంధం లేని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామా మల్లేశ్, గ్రేటర్ హైదరాబాద్ డిసిసి అధ్యక్షుడు నాగేందర్‌తో రాజీనామా చేయటంపై వ్యక్తమైన అసంతృప్తి గురించి కూడా నేటి సమావేశంలో చర్చ జరిగిందని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్టకట్టాలంటే పిసిసి, సిఎల్‌పి నాయకులందరినీ తొలగించి వారి స్థానంలో యువకులకు అవకాశం ఇవ్వాలంటూ వస్తున్న వాదనపై కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించాలనే సూచన వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడటానికి కారకులు, ప్రభుత్వాన్ని తరచు పొగిడే వారిపై చర్య తీసుకోకపోతే పార్టీ పటిష్టమయ్యే అవకాశం లేనే లేదని కొందరు సీనియర్ నాయకులు స్పష్టం చేశారని తెలిసింది. కాంగ్రెస్‌ను పటిష్ఠం చేసేందుకు నాయకులంతా కలిసికట్టుగా పని చేయటం గురించి నేటి సమావేశంలో చర్చించినట్లు జానారెడ్డి తెలిపారు. పిసిసి, సిఎల్‌పి నాయకత్వం త్వరలోనే హైదరాబాదులో అందరితో సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరుపుతామని విలేఖరులతో చెప్పారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్జ్‌లను నియమించాలని ఆలోచిస్తున్నామని షబ్బీర్ అలీ చెప్పారు. భట్టి మాట్లాడుతూ కెసిఆర్ పవర్ పాయింట్‌లోని లోపాలను ఎత్తి చూపించామన్నారు.