జాతీయ వార్తలు

బీజేపీ గూటికి అనర్హత ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 14: కర్నాటకలో అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేల్లో 16 మంది గురువారం బీజేపీలో చేరిపోయారు. వీరిలో 13 మందికి వచ్చే నెల 5న జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టిక్కెట్లు కూడా లభించాయి. ఉప ఎన్నికలు జరగనున్న 15 స్థానాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే 14 మంది అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించింది. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ అనర్హ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 24 గంటలు తిరక్కుండగానే 16 మంది బీజేపీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. కుమారస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-జేడీ(ఎస్) ప్రభుత్వ పతనానికి, ఎడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు దారితీసిన ఈ అనర్హ ఎమ్మెల్యేల తిరుగుబాటు అంతిమంగా కమలానికే కలిసివచ్చినట్టు అయింది. ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్నాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్ రావు తదితరుల సమక్షంలో వీరంతా బీజేపీలో చేరిపోయారు. 13 మంది అనర్హ ఎమ్మెల్యేలకు వారు గతంలో పోటీ చేసిన నియోజకవర్గాల నుంచే బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. అయితే మాజీ కార్పొరేటర్ ఎం సర్వాణకు మాత్రం శివాజీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. ఆర్ రోషన్‌బేగ్ అనే మరో ఎమ్మెల్యేకు మాత్రం బీజేపీలో ప్రవేశం లభించలేదు. అందుకు కారణం బేగ్ విషయంలో కొందరు పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడమేనని తెలుస్తోంది. ఈ పరిణామం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేసిన బేగ్ ఇండిపెండెంట్‌గానే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో అనర్హ ఎమ్మెల్యే ఆర్ శంకర్‌ను పార్టీలో చేర్చుకున్నప్పటికీ ఆయన విజయావకాశాల పట్ల అనుమానాలు వ్యక్తం కావడంతో బీజేపీ టికెట్ లభించలేదు.