జాతీయ వార్తలు

గిరిజనుల వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: కాంగ్రెస్ పార్టీ గిరిజనులను తన ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటోందని, కాని, వారి సంక్షేమం కోసం ఎలాంటి కృషి చేయడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం విమర్శించారు. గిరిజనుల వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుస అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గిరిజనుల జీవితాలలో మార్పు తెచ్చిందని ఆయన అన్నారు. జాతీయ గిరిజన పండుగ ‘ఆది మహోత్సవ్’ను శనివారం నాడిక్కడ అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గిరిజనుల వెనుక వారి సోదరుడిలాగా గట్టిగా నిలబడ్డారని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందేలా చూస్తున్నారని అన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ గిరిజనులను ఓటు బ్యాంకులాగా ఉపయోగించుకున్నది. అయితే, గిరిజనుల సంక్షేమం కోసం ఆ పార్టీ ఏమీ చేయలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే అది గిరిజనుల సంక్షేమం కోసం వరుస అభివృద్ధి పథకాలను చేపట్టింది’ అని అమిత్ షా అన్నారు. బీజేపీ నేత అటల్ బిహారి వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉనికిలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందింది గిరిజనులేనని ఆయన అన్నారు. గిరిజనులకు ఉచితంగా ఇళ్లు, వంట గ్యాస్ సరఫరా, విద్యుత్ కనెక్షన్లు వంటి వాటిని అందించడం జరిగిందని, వాటి ద్వారా గిరిజనులు బాగా లబ్ధి పొందారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులు చీకట్లో, నిరక్షరాస్యతలో, పేదరికంలో మగ్గిపోయారని ఆయన అన్నారు.

*చిత్రం... జాతీయ గిరిజన పండుగ ‘ఆది మహోత్సవ్’ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా