జాతీయ వార్తలు

సీఆర్‌పీఎఫ్ శిబిరాలపై మావో ‘డ్రోన్’ల నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: సీఆర్‌పీఎఫ్ శిబిరాలే లక్ష్యంగా మావోయిస్టులు అనుసరిస్తున్న సరికొత్త వ్యూహాలను తిప్పికొట్టే దిశగా కేంద్రం నడుం బిగించింది. ఇందులో భాగంగా ఇటీవల చత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ శిబిరాల ఉనికిపై డ్రోన్‌లు లేదా మానవ రహిత ఏరియల్ వాహనాల ద్వారా మావోయిస్టులు ఆరా తీయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది. ఇందులో భాగంగా ఏమాత్రం మావోల ఆచూకీ దొరికినా ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులను జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం చత్తీస్‌గఢ్ బస్తీర్ రీజియన్‌లోని సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ స్థావరాలే లక్ష్యంగా మావోయిస్టులు డ్రోన్లను వినియోగించడాన్ని భద్రతా బలగాలు పసిగట్టి కేంద్రానికి సమాచారం అందించాయి. ఈమేరకు ఆధునిక టెక్నాలజీతో బలగాలను లక్ష్యంగా చేసుకొని ఎలాంటి చర్యలకు మావోయిస్టులు పాల్పడినా సరే ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులను జారీ చేసినట్లు ఆదివారం సంబంధిత అధికారులు తెలియజేశారు. గత నెలలో చత్తీస్‌గఢ్‌లోని కిష్టారం, పల్లొడి ప్రాంతాల్లో ఎరుపు రంగులో ఉండే చిన్నపాటి డ్రోన్‌ల ద్వారా సమాచారాన్ని తెలుసుకొనేందుకు వారంలో మూడుసార్లు ఈ ప్రయోగాన్ని మావోలు ప్రయోగించడాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
కాగా, గుర్తు తెలియని వ్యక్తులకు ముంబయిలోని వ్యాపార కేంద్రాలు ఈ డ్రోన్‌లను విక్రయించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఎవరెవరు మావోయిస్టులకు ఈ డ్రోన్‌లను సరఫరా అనే అంశంపై విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒడిశా, మహారాష్టల్ల్రోని రోడ్డు సౌకర్యాలేని ప్రాంతాలే లక్ష్యంగా చేసుకొని ఎక్కడెక్కడ సీఆర్‌పీఎఫ్ బలగాలు మోహరించాయో కనుక్కోవడమే లక్ష్యంగా మావోయిస్టులు సరికొత్త టెక్నాలజీలో భాగంగా డ్రోన్‌లను వినియోగిస్తున్నట్లు సమాచారం.