జాతీయ వార్తలు

రక్షణ సహకారం బలోపేతంపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌టీ ఎస్పర్‌తో బ్యాంకాక్‌లో ఆదివారం ఇండో-పసిఫిక్ ప్రాంతం లో పరిస్థితి, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని మరింత పెం పొందించుకోవడం సహా వ్యూహాత్మక ప్రాముఖ్యత గల అనేక అంశాలపై చర్చలు జరిపారు. ఆసియాన్, భారత్ సహా దాని ఎనిమిది చర్చల భాగస్వాములతో కూడిన వేదిక ‘ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్- ప్లస్’ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ విడిగా మార్క్ టీ ఎస్పర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రాజ్‌నాథ్ జపాన్ రక్షణ శాఖ మంత్రి టారో కోనోతో కూడా విడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై కేంద్రీకరించి చర్చలు జరిపారు. భారతీయ అధికారులు ఇక్కడ ఈ విషయం వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్ ఎస్పర్‌తో జరిగిన సమావేశంలో నియమాల ఆధారంగా ఇండో-పసిఫిక్ ప్రాంతా న్ని స్వేచ్ఛాయుతమైనదిగా, సంఘటితమైనదిగా ఉంచాలనే, సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలనే భారత్ దృక్పథాన్ని పునరుద్ఘాటించారు. చైనా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన సైనిక, ఆర్థిక ప్రభావాన్ని వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో, బయట గల వివిధ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాం తం అంశంపై భారత్-అమెరికా మధ్య కలయిక పెరుగుతోందని, పది సభ్య దేశాలు గల ఆగ్నేయాసియా దేశాల కూటమి (ఆసియాన్) ఈ ప్రాంతానికి కేంద్రంగా ఉండాలని భారత్ భావిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ‘అమెరికా రక్షణ మంత్రి డాక్టర్ మార్క్ టీ ఎస్పర్‌తో బ్యాంకాక్‌లో ఈ రోజు మంచి సమావేశం జరిగింది. భారత్, అమెరికా మధ్య రక్షణ సహకారాన్ని విస్తరించుకోవడానికి గల మార్గాలను అనే్వషించడంపై మేము చర్చించాం’ అని రాజ్‌నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు.
*చిత్రం... అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్‌టీ ఎస్పర్‌తో రాజ్‌నాథ్ సింగ్